మహిళపై కుటుంబ సభ్యుల పాశవిక దాడి!

9 Jan, 2020 12:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూత వైద్యంలో భాగంగా రేణు అనే మహిళను ఆమె కుటుంబ సభ్యులే పాశవికంగా హింసించిన ఘటన బరేలీ జిల్లాలో జరిగింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఓ మహిళను గురువారం బరదార్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గురించి ఎస్సై నరేష్‌ త్యాగీ మాట్లాడుతూ.. ‘ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ గ్రామానికి చెందిన రేణుకు ఎనిమిదేళ్ల క్రితం సంజయ్‌తో వివాహం జరిగింది. గత కొద్ది రోజులుగా సంజయ్‌ తండ్రి జగదీష్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో బాధితురాలి వదిన మోనీ(సంజయ్‌ సోదరి) తన తండ్రి అనారోగ్యాన్ని నయం చేయడానికి భూతవైద్యాన్ని నేర్చుకుంది.  రేణుపై తన విద్యను ప్రదర్శించబోయింది. ఈ క్రమంలో రేణు ముఖం, ఇతర శరీర భాగాలపై మోనీ దాదాపు101 కత్తి గాట్లు పెట్టింది’ అని ఎస్సై పేర్కొన్నారు. 

కాగా ఈ ఘటనలో నిందితురాలు మోనీకి  ఆమె భర్త, సోదరుడు సంజయ్‌లు కూడా సహకరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పరుగెత్తే క్రమంలో ఆమె రోడ్డుపై స్పృహ\ కోల్పోయిందని.. ఆ సమయంలో పెట్రోలిం‍గ్‌లో ఉన్న పోలీసులు రేణును గుర్తించి హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పారు. రేణు పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూకి తరలించారని.. రేణు సోదరుడి ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీ సెక‌్షన్‌ 307(హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా రెండు రోజుల తర్వాత మెలకువలోకి వచ్చిన రేణు ఫిర్యాదు మేరకు ఈ కేసుపై విచారణ జరిపి.. మోనీని అరెస్టు చేయగా.. ఆమె భర్త, సోదరుడు పరారీలో ఉన్నట్లు ఎస్సై నరేష్‌ మీడియాకు తెలిపారు.

మరిన్ని వార్తలు