పూజల పేరిట టోకరా

19 Sep, 2019 07:29 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ పైడపునాయుడు

ఇల్లు అద్దెకు తీసుకుని యజమానినే ముంచేశారు

భారీగా నగదు, బంగారు ఆభరణాల కాజేత

పోలీసుల రంగప్రవేశంతో మోసగాళ్ల ఆటకట్టు

పెదగంట్యాడ(గాజువాక): శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలన్నారు.. మంచి వారని భావించిన ఇంటి యజమాని వారికి ఇల్లు అద్దెకు ఇచ్చారు. తర్వాత ఇరుకుటుంబాల వారు బాగా దగ్గరయ్యారు. ఒకరికొకరు కష్టసుఖాలను పంచుకునేవారు. ఇదే ఆ ఇంటి యజ మాని నిలువునా మోసపోవడానికి దారితీసింది. ఈ సంఘటన వివరాలను న్యూపోర్టు పోలీస్‌ స్టేషన్‌లో సీఐ పైడపునాయుడు విలేకరులకు బుధవారం వివరించారు.  ఇంటి యజమానికి పెళ్లయినా పిల్లలు లేకపోవడంతో అతని మేనకోడలను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం కలిగారు. అయితే యజమాని ఇటీవల మొదటి భార్యతో చనువుగా ఉండడంతో రెండో భార్య తట్టుకోలేపోయింది. తన పరిస్థితిని వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న వారితో వాపోయింది. ఇదే అదునుగా భావించి వారు ఆమెను నిలువునా ముంచేశారు. పూజల పేరిట రూ.4.20 లక్షల నగదుతో పాటు 7తులాల బంగారం, వెండి సామగ్రి దోచేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి అసలు రంగు బయటపడింది.

62వ వార్డు టీజీఆర్‌ నగర్‌లో దవులూరి చంద్రరావు అ నే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నా డు. ఏడాది కిందట శ్రీకాకుళం జిల్లాకు చెందిన వానపల్లి సీతారాం, అతని తల్లి పద్మ, చెల్లెలు కుమారితో వచ్చి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. చంద్రరావుకు వివా హమైనా పిల్లలు లేకపోవడంతో అతని మేనకోడలైన నిర్మలను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు  పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో చంద్రరావు మొద టి భార్యతో చనువుగా ఉండడంతో తట్టుకోలేకపోయిన నిర్మల ఇంట్లో అద్దెకుంటున్న వారితో తన పరిస్థితిని వివరించింది. ఇదే అదునుగా భావించిన వారు ‘నీ భర్తకు ప్రాణగండం ఉంద ని, పూజలు చేయాల’ని నమ్మబలికారు. అంతేకాకుండా ఆ విషయాన్ని తన భర్తకు చెబితే రక్తం కక్కుకుని చనిపోతాడని భయాందోళనకు గురి చేశారు. దీంతో భయపడిన నిర్మల భర్తకు తెలి యకుండా రూ.4.20 లక్షల నగదు, 7తులాల బంగారం, వెండి వస్తువులను దఫదఫాలుగా వారికి అందజేసింది. తర్వాత తాను మోసపోయానని భర్తకు తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను బుధవారం అరెస్టు చేశారు. వారి  నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.  సమావేశంలో ఎస్‌ఐ శ్రీనివాస్, ఏఎస్‌ఐ అప్పలరాజు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు