పెళ్లి పేరుతో మహిళ మోసం

5 Feb, 2018 09:51 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న బాధితులు , మోసం చేసినట్టు చెబుతున్న మహిళ (ఫైల్‌)

విలేకరుల సమావేశంలో బాధితుల ఆవేదన

ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌

చిత్తూరు,తిరుపతి కల్చరల్‌: పెళ్లి చేసుకొని ఇద్దురు పిల్లలు పుట్టిన తర్వాత భర్తను వదిలేసింది. మరో వ్యక్తిని మాయమాటలతో నమ్మించి ఇంట్లో చేరి నగలతో ఉడాయించింది. తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమెను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని బాధితులు ఇద్దరు ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల ఎదుట వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన గురుప్రసాద్‌ మాట్లాడుతూ 2005లో చంద్రకళ అనే మహిళతో తనకు వివాహమైందని తెలిపాడు. ఏడేళ్లు సాగిన కాపురంలో తమకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారని పేర్కొన్నాడు. తర్వాత ఒక కుమారున్ని తీసుకొని ఆమె తన నుంచి వెళ్లిపోయి మోసం చేసిందని ఆరోపించాడు.

తిరుపతి శివజ్యోతినగర్‌లో కాపురమున్న  గిరిబాబు భార్య నాగమణి మాట్లాడుతూ తాము మదనపల్లెలో అంగడి నడుపుకుంటూ జీవనం సాగించే వారమని తెలిపింది. చంద్రకళ అనే మహిళ తనకు ఎవరూ లేరని, బతుకు దెరువు చూపాలని తమను ఆశ్రయించిందని పేర్కొంది. ఇంటిలో పని చేసుకుంటూ బతకమని తమ ఇంటిలోనే ఒక గది ఆమెకు ఇచ్చామని తెలిపింది. ఈ క్రమంలో తన భర్తను వలలో వేసుకుందని, తాము ఇంటిలో లేని సమయంలో ఇంటిలోనున్న రూ.7 లక్షల నగదును తీసుకొని ఉడాయించిందని ఆరోపించింది. తమ బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని బంగారు నగలు తీసుకొని వెళ్లిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం మూడో వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవకోన ప్రాంతంలో ఉందని తెలిపింది. తమ బంగారు నగలు, డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని పేర్కొంది. పోలీసు అధికారులు స్పందించి సదరు చంద్రకళపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం