మాజీ ప్రియుడ్ని చంపి నదిలో పడేసింది

2 Sep, 2018 15:47 IST|Sakshi

నోయిడా: తన న్యూడ్‌ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బ్లాక్‌మెయిల్‌ చేయడంతో  ఓ మహిళ తన మాజీ ప్రియుడిని చంపేసింది. నోయిడాకు చెందిన డాలీ చౌదరీ(21), సుశీల్‌ కుమార్‌(23)లు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మనస్పర్థలు రావడంతో డాలీ చౌదరీ విడిపోయి మోహిత్‌ మావి(28) అనే వ్యక్తితో గ్రేటర్‌ నోయిడాలో సహజీవనం చేస్తోంది.  మోహిత్‌ మావి, డాలీ చౌదరీతో సహజీవనం చేస్తున్నాడని తెలిసి మోహిత్‌ భార్య ఆగస్టు 7న ఆత్మహత్య చేసుకుంది. భార్య తరపు బంధువుల నుంచి బెదిరింపులు రావడంతో మోహిత్‌ బెంగుళూరుకు పారిపోయాడు.

అయితే గత  నెల 16న డాలీ మాజీ ప్రియుడు సుశీల్‌ కుమార్‌ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఈ విషయమై సుశీల్‌ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి డాలీని విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సుశీల్‌ వేరొక మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని, తన న్యూడ్‌ ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పెడతానని బ్లాక్‌మెయిలింగ్‌ పాల్పడ్డాడని విచారణలో పోలీసులకు తెలిపింది. అందువల్లే తాను మరొకరితో కలిసి హత్య చేసేందుకు పూనుకున్నానని డాలీ పోలీసులకు తెలిపింది. డాలీకి మనీష్‌ చౌదరీ అనే వ్యక్తితో పెళ్లి చేయాలని డాలీ తండ్రి అనుకున్నాడు. కానీ ఆ వివాహం జరగలేదు.

ఇంతలో సుశీల్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడంతో ఈ విషయం మనీష్‌కు డాలీ చెప్పింది. ఇద్దరూ కలిసి సుశీల్‌ హత్యకు కుట్రపన్నారు. సుశీల్‌కు డాలీ ఫోన్‌ చేసి మాట్లాడి పరిష్కరించరించుకుందామని చెప్పింది. దీంతో సుశీల్‌ బెంగుళూరు నుంచి గ్రేటర్‌ నోయిడాకు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఓ హోటల్లో దిగారు. కూల్‌ డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి సుశీల్‌కు ఇచ్చింది. స్పృహ కోల్పోయిన అనంతరం మనీష్‌ను హోటల్‌కు రమ్మని కాల్‌ చేసింది. ఇద్దరు కలసి సుశీల్‌ కుమార్‌ను చంపి ఆ తర్వాత  మాధురా రైల్వే స్టేషన్‌ వద్ద యమునా నదిలో పడేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు