భర్త, కుమారుడిని వదిలేసి సహజీవనం.. ఆత్మహత్య

22 Jul, 2019 09:09 IST|Sakshi
స్వాతి మృతదేహం

బంజారాహిల్స్‌: తాను దుబాయ్‌కి వెళ్తానంటే నిరాకరించాడని మనస్తాపానికిలోనైన ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రి సమీపంలోని జక్కంపేట గ్రామానికి చెందిన చాప స్వాతి(24) హైదరాబాద్‌లోని రహ్మత్‌నగర్‌ వీడియో గల్లీకి చెందిన దోసపాటి గోపి అనే పెయింటర్‌తో రెండేల్లుగా సహజీవనం చేస్తోంది. ఆమెకు గతంలోనే పెళ్లికాగా ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే స్వాతి తన భర్త, కుమారుడిని రాజమండ్రిలోనే వదిలేసి అప్పటికే వివాహమై గోపీతో సహజీవనం చేస్తోంది. మూడు రోజుల క్రితం గోపి మొదటి భార్య భాగ్యమ్మ ఇంటికి వచ్చి తన కుమారుడి స్కూల్‌ ఫీజు కట్టాలని అతడిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో అతను స్వాతితో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు ముగ్గురం కలిసే ఉందామని చెప్పాడు. ఇందుకు స్వాతి  నిరాకరిస్తూ తాను దుబాయ్‌ వెళ్తానని చెప్పగా అందుకు  గోపి అంగీకరించలేదు. దీంతో స్వాతి తన స్వగ్రామానికి వెళ్లి, శనివారం రాత్రి తిరిగి రాగా ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. మళ్లీ ఎందుకు వచ్చావంటూ గోపి నిలదీయడంతో మనస్తాపానికిలోనైన స్వాతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నిద్ర లేచిన గోపి దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. గోపిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ ఎస్‌ఐ శేఖర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలికపై సామూహిక లైంగికదాడి

ఇంటి పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం

కుప్పంలో దొంగనోట్ల ముఠా!

ఎంపీ గల్లా అనుచరులపై కేసు

అనసూయ పేరుతో అభ్యంతరకర పోస్టులు

ప్రేమ వ్యవహారమేనా..?

సౌదీలో పరిచయం.. తమిళనాడులో సంబంధం

బ్యూటీషియన్‌ దారుణ హత్య

అమెరికాలో పూజారిపై దాడి

హైదరాబాద్‌కు ఐసిస్‌ నమూనాలు!

ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌పై మరో కేసు

షేక్ సద్దాంను హత్య చేసిన నిందితుల అరెస్ట్‌

ఉపాధ్యాయుల ఇళ్లలో భారీ చోరీ

నిరుద్యోగులే టార్గెట్‌.. రూ.కోటితో ఉడాయింపు!

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం

ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించేశాడు..!

రక్తంతో గర్ల్‌ఫ్రెండ్‌కు బొట్టుపెట్టి..

పింకీ! నీవెలా చనిపోయావో చెప్పమ్మా..

బాలిక దారుణ హత్య: తండ్రిపైనే అనుమానం!

రక్షక భటుడు.. దోపిడీ ముఠాకు సలహాదారుడు

పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

సీతాఫల్‌మండిలో విషాదం

భార్యను చంపి, కిటికీకి ఉరివేసి.. 

ప్రేమికుడి తల్లిని స్తంభానికి కట్టేసి..

విషంతో బిర్యానీ వండి భర్తకు పెట్టింది..

ప్రేమ వ్యవహరమే కారణమా..?

నడిరోడ్డుపై హత్య చేసి తలతో పోలీస్‌ స్టేషన్‌కి..

ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేస్తా!

తల్లి వద్దనుకుంది.. మూగజీవులు కాపాడాయి

సవతి తండ్రిని కాల్చి చంపిన కొడుకు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు