యువతి ఆత్మహత్య

28 Oct, 2017 06:48 IST|Sakshi
తేన్‌మొళి (ఫైల్‌),ఆందోళన చేస్తున్న బంధువులు

పోలీసు ప్రేమించి మోసం చేశాడని ఘటన

కలెక్టరేట్‌ ముందు కుటుంబీకుల ధర్నా

సేలం: ప్రేమించి మోసం చేసిన పోలీసుపై చర్యలు తీసుకోలేదంటూ ఓ  యువతి లేఖ రాసి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. అతను పోలీసు శాఖకు చెందిన వ్యక్తి కావడంతో చర్యలు తీసుకోకపోవడంతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆ యువతి తల్లిందండ్రులు, బంధువులు కలెక్టరేట్‌ ముందు శుక్రవారం ఆందోళన చేశారు. వివరాలు.. సేలం పాత సూరమంగళం ప్రాంతానికి చెందిన యువతి తేన్‌మొళి(23). ఈమె బంధువు, సాయుధ దళ పోలీసు శ్రీనివాస మురుగన్‌ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు శ్రీనివాస మురుగన్‌ తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో తేన్‌మొళికి, శ్రీనివాసన మురుగన్‌ దూరమైనట్లు తెలిసింది.

ఈ విషయంపై తేన్‌మొళి ఆగస్టులో అస్తంపట్టి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే వారు చర్యలు చేపట్టలేదు. దీంతో విరక్తి చెందిన తేన్‌మొళి తన పరిస్థితిని వివరిస్తూ నాలుగు పేజీల ఓ లేఖను రాసి శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆగ్రహించిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు శ్రీనివాసమురుగన్‌పై పోలీసులు చర్యలు తీసుకోవడం లేద న్న కారణంతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందం టూ తేన్‌మొళి తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ఈ సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులు వారికి సర్ధి చెప్పడంతో ఆందోళనను విరించారు. కానీ శ్రీనివాస మురుగన్‌ను అరెస్టు చేసేంత వరకు తేన్‌మొళి మృతదేహాన్ని తీసుకోమని వారు తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, తేన్‌మొళి రాసిన లేఖ ఆధారంగా విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు