రైల్వే ట్రాక్‌ పక్కన యువతి మృతదేహం

31 May, 2019 12:59 IST|Sakshi
లింగనేనిదొడ్డి వద్ద రైల్వే ట్రాక్‌ పక్కన పడిఉన్న యువతి మృతదేహం

కర్నూలు, తుగ్గలి: మండలంలోని లింగనేనిదొడ్డి రైల్వే స్టేషన్‌ సమీపంలో ట్రాక్‌ పక్కన ఓ యువతి మృతదేహం లభ్యమైంది. డోన్‌ రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. కాకినాడకు చెందిన చిన్న(27) బుధవారం హైదరాబాద్‌ నుంచి కాచిగూడ–యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అనంతపురం బయలుదేరింది. తెల్లవారుజామున మార్గమధ్యంలో తుగ్గలి మండలం లింగనేనిదొడ్డి రైల్వే స్టేషన్‌ సమీపంలో ట్రాక్‌ పక్కన ఆమె మృతదేహం పడిఉంది. గమనించిన స్థానికులు, రైల్వే సిబ్బంది డోన్‌ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకొని కాకినాడకు చెందిన సత్యవతి కూతురు చిన్నిగా గుర్తించి తల్లికి సమాచారం చేరవేశారు. సత్యవతికి ఐదుగురు కూతుళ్లు కాగా చిన్ని మూడో సంతానం. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. మరో ఉద్యోగం వెతుక్కునే క్రమంలో అనంతపురం వెళ్లి అక్కడి నుంచి బెంగళూరు వెళ్లాలనుకుంది. ఈక్రమంలో ఆమె రైలు నుంచి జారిపడిందా? లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని రైల్వే పోలీసులు గురువారం తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు