బాలల హక్కులు హరిస్తే కేసులే!

10 Jan, 2017 03:45 IST|Sakshi
బాలల హక్కులు హరిస్తే కేసులే!

ఇంకొల్లు : బాలల హక్కులను హరించే వారిపై కేసులు నమోదు చేస్తామని జిల్లా బాలల సంరక్షణాధికారిణి జ్యోతిసుప్రియ హెచ్చరించారు. ‘బతుకులు మెతుకులు వెతుకుతున్నయట!’ శీర్షికన ఈనెల 8వ తేదీన ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. సోమవారం ఇంకొల్లు వద్ద పాత మద్రాసు రోడ్డులో మట్టి పనులు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి సౌకర్యాలను పరిశీలించారు. అక్కడున్న పిల్లలను సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కార్యకర్తలను ఆదేశించారు. పనులు చేసే ప్రాంతాల్లో బాలలకు రక్షణకు చర్యలు చేపట్టాలని  కాంట్రాక్టర్లకు సూచించారు. లేదంటే బాలల హక్కులను హరిస్తున్నందుకు వారిపై కేసు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు.

మరిన్ని వార్తలు