న్యూజీలాండ్‌లో అనభేరి 106వ జయంతి వేడుకలు

15 Aug, 2016 20:28 IST|Sakshi
న్యూజీలాండ్‌లో అనభేరి 106వ జయంతి వేడుకలు

ఆక్లాండ్: తెలంగాణ భగత్ సింగ్‌గా పేరుగాంచిన అనభేరి ప్రభాకర్ రావు 106వ జయంతి వేడుకలను సోమవారం న్యూజీలాండ్‌లో ఘనంగా జరుపుకున్నారు. అనభేరి కుటుంబసభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టీఏఎన్‌జడ్) సభ్యులతో పాటు అక్కడి తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనభేరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనభేరి ప్రభాకర్ రావు సేవలను గుర్తుచేసుకున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
న్యూజీలాండ్‌లో భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను టీఏఎన్‌జడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆక్లండ్‌లోని మౌంట్‌రాస్కిల్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో టీఏఎన్‌జడ్ సభ్యులతో పాటు తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

Read latest Diaspora News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు