భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు

17 Jan, 2017 18:05 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు నియమితులయ్యారు. సిలికాన్‌ వ్యాలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా.. హౌస్‌ బడ్జెట్‌ కమిటీకి, సియాటెల్‌ నుంచి ఎన్నికైన ప్రమీలా జయపాల్‌ హౌస్‌ జుడీషియరీ కమిటీకి నామినేట్‌ అయ్యారు. షికాగో ఉత్తర, వాయవ్య ప్రాంతం నుంచి ఎన్నికైన కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి హౌస్‌ ఎడ్యుకేషన్, వర్క్‌ఫోర్స్‌ కమిటీకి నామినేట్‌ అయ్యారు. దీంతోపాటే హౌస్‌ డెమొక్రటిక్‌ పాలసీ, స్టీరింగ్‌ కమిటీ బాధ్యతలను కృష్ణమూర్తి చూసుకోన్నారు.

అమిత్‌ బేరా విదేశీవ్యవహారాల కమిటీ, సైన్స్, స్పేస్, టెక్నాలజీ కమిటీకి తిరిగి నామినేట్‌ అయ్యారు. అమెరికా సెనేట్‌కు తొలిసారి ఎన్నికైన కమలా హారిస్‌..బడ్జెట్‌ కమిటీ, నిఘా సెలక్ట్‌ కమిటీ, పర్యావరణ, ప్రజాపనుల కమిటీ, భద్రత, ప్రభుత్వ వ్యవహారాల కమిటీ ఇలా నాలుగు కమిటీలకు నామినేట్‌ అయ్యారు. ఇంతమంది భారతీయ అమెరికన్లు కీలక కమిటీలకు ఎన్నికవడం అమెరికాకాంగ్రెస్‌ చరిత్రలోనే తొలిసారి.

మరిన్ని వార్తలు