ఔత్సాహిక రియల్టర్ల కోసం డాలస్ 'టీ' సదస్సు

10 May, 2016 23:37 IST|Sakshi
ఔత్సాహిక రియల్టర్ల కోసం డాలస్ 'టీ' సదస్సు

డాలస్: నానాటికీ విస్తరిస్తోన్న డాలస్ ఫోర్ట్ వర్త్ (డిఎఫ్ డబ్ల్యూ) రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఔత్సాహిక తెలుగు వ్యాపారవేత్తలు ప్రవేశించేలా చేయూత, సహకారం అందించడంలో భాగంగా సోమవారం డలాస్ లో తెలుగు ఎంటర్ ప్రెన్యూర్స్ అసోసియేషన్ (టీ) నిర్వహించిన సెమినార్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మార్కెట్ స్థితిగతులు, లాభాలు ఎలా గడించాలనే విషయాలపై నిపుణులు చేసిన సూచనలను సదస్సుకు హాజరైన వ్యాపారవేత్తలు శ్రద్ధగా విని తెలుసుకున్నారు. తెలుగు నేపథ్యం ఉన్న యువకులు, మహిళా వ్యాపారవేత్తలు డిఎఫ్ డబ్ల్యూ రియల్ రంగంలో రాణించేందుకు ఏర్పాటుచేసిన ఈ సెమినార్.. డాలస్ లోని దేశీ ప్లాజా ఈవెంట్ సెంటర్ లో మే9న జరిగింది. రెండు గంటలపాటు సాగిన సదస్సుకు దాదాపు 150 మందికిపైగా వ్యాపారులు హాజరయ్యారు.

డీఎఫ్ డబ్ల్యూ రియల్ రంగంలో యువ వ్యాపారవేత్తలు ఏమేరకు రాణించే అవకాశం ఉందో, ఆమేరకు ఎదురయ్యే సవాళ్లు, అధిగమించాల్సిన కష్టనష్టాల గురించి తెలియపర్చడమే సదస్సు ముఖ్య ఉద్దేశం అని 'టీ' నిర్వాహకులు పేర్కొన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గుర్రం శ్రీనివాసరెడ్డి సదస్సును ప్రారంభిస్తూ 'టీ' లక్ష్యాలను ఆహుతులకు వివరించారు. 2010లో ప్రారంభమైన నాటి నుంచి 2015 వరు 'టీ'ని పలు విధాలుగా విస్తరించిన మాజీ అధ్యక్షులు శీను పోహర్, సురేశ్ ఉలువల, ప్రతాప్ భీంరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు పల్లవి తోటకూర సదస్సు నిర్వహణలో ప్రధాన పాత్ర పోశించారు.

టీ డాలస్ చాప్టర్ అధ్యక్షుడు రాజా పబ్బ మాట్లాడుతూ భవిష్యత్తులో వ్యాపారంలో రాణించాలనుకునేవారికి టీ చక్కటి వేదికగా నిలవబోతున్నదని, ఆ మేరకు రూపొందించిన ఐదు అంచెల విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఇంత గొప్ప కార్యక్రమానికి వేదిక ఇచ్చిన దేశీ ప్లాజా యజమాని మనోహర్ నిమ్మగడ్డ, కృష్ణ పుట్టపర్తిలతోపాటు ప్లానో రెస్టారెంట్ భాగస్వామి శ్రీని వేములలకు ధన్యవాదాలు తెలియజేశారు.

మహేశ్ గజ్జల, శ్రాన్ గాఫ్, శీను పొహార్, టీ డాలస్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ పల్లవి తోటకూర, సెక్రటరీ జాగ్స్ పోరండ్ల, జాయింట్ ట్రెజరర్ సంధ్య పడాల, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రత్న పట్నాల, శీను పోహర్, టీ మాజీ అధ్యక్షులు సురేశ్ వేముల, ప్రతాప్ భీంరెడ్డి, ప్రేమ్ గంగాలకుంట, మాజీ సెక్రటరీలు సత్యం వీర్నపు, శరత్ పున్ రెడ్డి, మాజీ ట్రజరర్ వెంకట్ అప్పిరెడ్డి, మాజీ జాయింట్ ట్రెజరర్, శారద సంగిరెడ్డి, ప్రస్తుత ట్రెజరర్ సాంబ అవెర్నేని, మాజీ ఉపాధ్యక్షుడు విసు పాలెపు, మాజీ ట్రెజరర్, విజయ్ పుట్టా, మాజీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రంగు గజ్జల, ఉపాధ్యక్షుడు రాజా పబ్బ, అధ్యక్షుడు మహేశ్ గూడూరి, కాకి వసుంధర, ప్రవీణ్ తోట, మనోహర్ గంజేటి, మహేందర్ గణపురం, మాజీ ఉపాధ్యక్షులు భీమా పెంట, సతీశ్ పున్నం, నాజ్ ఎం షేక్, శ్యామ రుమాళ్ల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్థానిక తెలుగు సంఘం టాంటెక్స్ నుంచి అధ్యక్షుడు సుబ్బు జొన్నలగడ్డ, మాజీ అధ్యక్షుడు ఉరిమిండి నర్సింహారెడ్డి, తెలుగు జాతీయ సంస్థలు నాటా, టానా, ఆటా, నాట్స్, టాటా, టీడీఎఫ్, డాటా, టీపీఏడీలు తమ సహకారాన్ని అందించాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం www.teaglobal.org వెబ్ సైట్ లేదా www.facebook.com/teadallas ఫేస్ బుక్ పేజ్ ను సందర్శించవచ్చు.

 

 

>
మరిన్ని వార్తలు