​ఐటీడీఏ పీవో సోదరి ఇంట్లో ఏసీబీ సోదాలు

1 Nov, 2016 23:36 IST|Sakshi
శ్రీకాకుళం సిటీ : సీతంపేట ఐటీడీఏ ప్రోజెక్టు అధికారి జల్లేపల్లి వెంకట్రావు అక్రమ ఆస్థులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపద్యంలో అవినీతి నిరోదక శాఖ అధికారులు మంగళవారం శ్రీకాకుళం నగరం రాజీవ్‌నగర్‌లో అతని సోదరి మంగవేణి ఇంట్లో దాడులు నిర్వహించారు. మంగవేణి భర్త కపాల రమణమూర్తి శ్రీకాకుళం, ఎస్సీ బాలుర వసతి గృహంలో వార్డెన్‌గా పనిచేస్తున్నారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ (కాకినాడ) బి రాజశేఖరరావు, కమ్యూనిటీ హెల్త్‌ అధికారి(శ్రీకాకుళం) ఎం లక్ష్మణరావులు తనిఖీలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను, రికార్డులను పరిశీలించారు. ఐటీడీఏ పీవోకు సంబందించి ఎటువంటి ఆదారాలు ఇక్కడ లబించలేదని స్పష్టం చేసారు. 
 
మరిన్ని వార్తలు