ఉత్సాహంగా బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌ శిక్షణ

18 Jul, 2016 02:23 IST|Sakshi
అనంతపురం స్పోర్ట్స్‌ : స్పెయిన్‌ బాస్కెట్‌బాల్,ఫుట్‌బాల్‌ క్రీడాకారుల ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ  ఆదివారం ఉత్సాహంగా సాగింది. యూఈఎస్‌సీ,క్యూబాస్కెట్‌ సెంట్‌కుగాట్‌ బృందం ఇండోర్, ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో బాస్కెట్‌బాల్, సెయింట్‌ కుగాట్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆర్డీటీ స్టేడియంలో ఇస్తున్న ఫుట్‌బాల్‌ శిక్షణ రెండో రోజుకు చేరింది. క్రీడాకారులకు బేసిక్స్‌ తెలియజేశారు. ఆటలో మెలకువలకంటే నిబంధనలు, ఏకాగ్రత, ఫిట్‌నెస్‌పై సూచనలు, సలహాలు అందజేశారు. ఈ శిబిరంలో బాస్కెట్‌బాల్‌ కోచ్‌ ఓరియల్‌ ఆంత్రాస్, ఫుట్‌బాల్‌ క్లబ్‌ కోఆర్డినేటర్‌ జామగార్సియ పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు