సాంకేతిక రంగంలో గిరిజన యువతులు

7 Mar, 2017 23:17 IST|Sakshi
సాంకేతిక రంగంలో గిరిజన యువతులు
‘ముదితల్‌ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగ¯ŒS’ అనే విషయాన్ని మరోమారు ఆదివాసీ యువతులు రుజువు చేశారు. ఎల్‌ఈడీ బల్బుల తయారీలో ముందంజ వేశారు. దాదాపు 70 మంది గిరిజన యువతులు ఉపాధి పొందుతున్నారు. రూ.ఐదు కోట్ల బల్బుల సరఫరాకు ఆర్డర్‌ పొందారు. స్వయం ఉపాధి రంగంలో దిక్సూచిగా నిలిచిన రంపచోడవరం ఆదివాసీ యువతులు విజయగాథ ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది. 
– రంపచోడవరం 
 
ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగాల కో సం అనేక చోట్ల తిరిగి నేడు అనేక మంది గిరిజన యువతకు ఉపాధినిస్తోంది వీరలక్ష్మి. ‘రంప గిరి జన మహిళ సమాఖ్య పరిశ్రమ కో ఆపరేటివ్‌ సొసైటీ’ పేరుతో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ బల్బుల తయారీ యూనిట్‌లో 41 మంది గిరిజన యువతులు సభ్యులుగా మరో 29 మంది ఉపాధి పొందుతున్నారు. వీరికి జీతాలతో పాటు సభ్యులు యూనిట్‌ నిర్వహణ ద్వారా వచ్చే లాభాలను సమానంగా పంచుకుంటారు. ఏజెన్సీలో ఇంజినీరింగ్‌ చదివి గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేవని కేవలం ఏజెన్సీ డీఎస్సీ తప్ప అంటూ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ మీటింగ్‌లో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది. ఏజెన్సీలో పరిశ్రమ స్థాపన కోసం నిర్వహించిన అన్ని అర్హత పరీక్షల్లో విజయం సాధించి నేడు ఎల్‌ఈడీ యూనిట్‌ నిర్వహణ దగ్గర నుంచి మార్కెట్‌ వరకు అన్ని తానై చూసుకుంటుంది.
రూ.5 కోట్ల ఆర్డర్‌
లాభాల బాటలో పయనిస్తున్న ఎల్‌ఈడీ యూనిట్‌ రూ. 5 కోట్లు వ్యాపారం దిశగా అడుగులు వేస్తోది. ఏపీఈపీడీసీఎల్‌కు రూ. 3 కోట్లతో  పాటు ఇతర సంస్థలకు కూడా ఎల్‌ఈడీ ఉత్పత్తులు సరఫరా చేసేందుకు అర్డర్‌ పొందారు. జిల్లా కలెక్టర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్, ఐటీడీఏ పీవో ఎఎస్‌ దినేష్‌కుమార్‌ ప్రోత్సాహంతో ముందుకు వెళ్లుతున్నారు.
 
మరిన్ని వార్తలు