దళితులపై దాడికి నిరసన

10 Aug, 2016 20:16 IST|Sakshi
కొరిటెపాడు (గుంటూరు): తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాదిగలపై మతోన్మాదుల దాడులకు నిరసనగా నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ చేపట్టారు. లాడ్జి సెంటర్‌ నుంచి ప్రారంభమైన  ఈ ర్యాలీ శంకర్‌విలాస్‌ సెంటర్, ఏసీ కళాశాల మీదుగా మార్కెట్‌ సెంటర్‌ వరకు కొనసాగింది. ముందుగా  అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  శ్రీనివాసరావు మాదిగ మాట్లాడుతూ.. అమలాపురంలో విద్యుత్‌ షాక్‌తో చనిపోయిన ఆవు చర్మాన్ని దళిత మాదిగలు తీస్తుండగా కొంతమంది హిందూ మత ఉన్మాదులు విచక్షణా రహితంగా స్తంభానికి కట్టేసి కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పశువుల నుంచి చర్మాన్ని వలిచి సమాజం మొత్తానికి పాదరక్షకులు అయిన చెప్పులు అందిస్తూ మాదిగ జాతి సమాజానికి సేవలు అందిస్తుందని తెలిపారు. చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్నారన్న నెపంతో మోకాటి ఎలీషా, మోకాటి మోజస్, మోకాటి వెంకటేశ్వర్లులపై దాడి చేయటం దుర్మార్గమన్నారు. ఈ దాడి మాదిగజాతి సంస్కృతి, సంప్రదాయం, అస్తిత్వం మీద జరిగిన దాడిగా అభివర్ణించారు. దాడికి పాల్పడ్డవారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసులు నమోదు చేసి, తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు మల్లవరపు రవిరాజామాదిగ, వట్టెపు చిన్నామాదిగ, జి.గురవయ్యమాదిగ, కట్టా బాబు, పి.మంగయ్యమాదిగ, బొమ్మా డేవిడ్‌మాదిగ, ఆర్‌.ఇస్రాయేలు, వినుకొండ బాబు, కె.సాల్మన్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు