అన్నీ ఉంటేనే అనుమతి

22 Oct, 2016 21:27 IST|Sakshi
  • పాఠశాలకు యూడైస్‌ కోడ్‌ తప్పనిసరి
  • ఛైల్డ్‌ ఇ¯ŒSఫోలో విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి
  • లేకుంటే పది పరీక్షలకు ప్రవేశం లేదు
  •  
    పదవ తరగతి విద్యార్థుల అన్ని వివరాలు చైల్డ్‌ ఇ¯ŒSఫోలో నమోదు చేయాల్సి ఉంది. పాఠశాల యూడైస్‌ కోడ్‌..విద్యార్థికి సంబంధించిన ఆధార్‌కార్డు నంబరు..పాఠశాలలో అనుమతి ఉన్న సెక్షన్లకు మించి విద్యార్థులు ఉన్నారా.. తదితర వివరాలన్నింటినీ హెచ్‌ఎంలు ఒకసారి సరిచూసుకోవాల్సి ఉంది. లేకుంటే మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
     
    రాయవరం : 
    యూనిఫైడ్‌ డిస్టిక్ట్ర్‌ ఇన్ఫర్మేష¯ŒS ఆఫ్‌ ఎడ్యుకేష¯ŒS(యూడైస్‌) నంబరు అన్ని యాజమాన్యాల పాఠశాలలకు తప్పనిసరి చేశారు. దేశవ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలలకు యూనిక్‌ నంబర్‌ను కేటాయించారు. యూడైస్‌ జాబితాలో పాఠశాల పేరు ఉంటేనే అది ప్రభుత్వ లెక్కల్లో ఉన్నట్టు. ప్రభుత్వ గుర్తింపు ఉండి..యూడైస్‌ కోడ్‌ లేకపోయినా ఆ పాఠశాలను పరిగణనలోకి తీసుకోరు. వాస్తవానికి 2008లోనే యూడైస్‌ కోడ్‌ అమలులోకి వచ్చింది. ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకుల్లో చాలా మందికి అవగాహన లేక పోవడం, నిర్లక్ష్యంగా కారణంగా యూడైస్‌ కోడ్‌కు దరఖాస్తు చేసుకోలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో నిర్వాహకులు హడావిడిగా యూడైస్‌ కోడ్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
     
    విద్యార్థుల వివరాల నమోదు..
    విద్యార్థుల వివరాలను ఆ¯ŒSలై¯ŒS చేయడంలో భాగంగా ’చైల్డ్‌ ఇ¯ŒSఫో’ నమోదు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. యూడైస్‌ జాబితాలో ఉన్న 1–10 తరగతుల విద్యార్థుల పూర్తి వివరాలు చైల్డ్‌ ఇ¯ŒSఫోలో నమోదు చేయాలి. విద్యార్థి పేరు, తరగతి, ఊరు, కులం, తల్లిదండ్రులు, వార్షిక ఆదాయం, ఆధార్‌నంబరు..ఇలా 24 అంశాలను ఇందులో పొందుపర్చాలి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని 5,918 పాఠశాలల్లో 1–10 తరగతుల విద్యార్థులు 7, 27,437 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటి దాకా 7,02,229 మంది వివరాలను నమోదు చేశారు. ఇంకా 25,208 మంది వివరాలు  నమోదు చేయాల్సి ఉన్నట్టు సమాచారం. సమ్మేటివ్‌–2,3 పరీక్ష పేపర్లు కూడా చైల్డ్‌ ఇ¯ŒSఫో ఆధారంగానే అందజేయనున్నారు. విద్యార్థుల వివరాలు ఆ¯ŒSలై¯ŒS కాకపోతే దానికి ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు బాధ్యులవుతారు.
     
    విద్యార్థులకు తీవ్ర నష్టం..
    విద్యార్థుల వివరాలు, చైల్డ్‌ ఇ¯ŒSఫోలో నమోదు చేయక పోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ఫలాలు అందవు. నమోదు కాని విద్యార్థులు నష్టపోతారు. ఎంఈఓలు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చొరవ తీసుకుని ఛిజిజీlఛీజీnజౌ.్చ p.nజీఛి.జీn వెబ్‌సైట్‌లో విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి.
     – ఆర్‌.నరసిహారావు,డీఈవో, కాకినాడ. 
     
    నామినల్‌ రోల్స్‌కు..
    ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల వివరాలు కచ్చితంగా చైల్డ్‌ ఇ¯ŒSఫోలో నమోదు చేసి ఉండాలి. చదువుతున్న స్కూల్‌కు యూడైస్‌ కోడ్‌ తప్పనిసరి. ఇవి లేక పోతే ఆయా విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ కంప్యూటర్లు తీసుకోవు. పైగా ఈ విద్యా సంవత్సరం నుంచి ’వితౌట్‌ స్కూల్‌ స్టడీ’ ఉండదు. అలాంటి వారికి ఓపె¯ŒS స్కూల్‌ ద్వారా పరీక్ష ఫీజు కట్టించాల్సి ఉంటుంది.
     – జి.నాగేశ్వరరావు, అసిస్టెంట్‌ కమిషర్‌ ఫర్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేష¯Œ్స.  
     
మరిన్ని వార్తలు