అంజలీదేవికి నివాళి

25 Jan, 2017 22:57 IST|Sakshi
అంజలీదేవికి నివాళి
 
పెద్దాపురం :  
నటనతో ప్రజలందరినీ మెప్పించిన కలియుగ సీత అంజలీ దేవి అని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అన్నారు. పెద్దాపురం పట్టణ ఆడపడుచు అంజలీ దేవి మూడో వర్ధంతిని బుధవారం సాయంత్రం నిర్వహించారు. అంజలీదేవి ఫౌండేష¯ŒS చైర్మ¯ŒS, ప్రముఖ పారిశ్రామిక వేత్త గోలి రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆమెను నేటి కళాకారులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గోలి రామారావు మాట్లాడుతూ అంజలీదేవి పెద్దాపురం పట్టణంలో జన్మించిడం గర్వకారణమన్నారు. అంజలిదేవి తనయుడు పీయూఎస్‌ చిన్నారావు మాట్లాడుతూ తన తల్లిపై పట్టణ ప్రజలకు ఉన్న ఆదరాభిమానాలను చూస్తే గర్వకారణంగా ఉందన్నారు. ఫౌండేష¯ŒS కన్వీనర్‌ పొలమరశెట్టి సత్తిబాబు, అంజలిదేవి మేనల్లుళ్లు గోళ్ల బాబీ, గోళ్ల శ్రీను మాట్లాడారు. తొలుత అంజలీదేవి విగ్రహానికి ఎమ్మెల్సీ బొడ్డు, గోలి తదితరులు క్షీరాభిషేకం చేసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ వి.ముని రామయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మ¯ŒS త్సలికి సత్య భాస్కరరావు, కౌన్సిలర్లు వాసంశెట్టి గంగ, గోకిన ప్రభాకరరావు, విజ్జపు రాజశేఖర్, తూతిక రాజు, పాగా సురేష్‌కుమార్, అభిమాన సంఘం కార్యదర్శి వెలగల కృష్ణ పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు