రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు మృతి

25 Jan, 2017 23:10 IST|Sakshi

తనకల్లు (కదిరి) : అమడగూరు మండలం కొట్టువారిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు పి.నాగేంద్రరెడ్డి (40) తనకల్లు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగేంద్రరెడ్డి పూలకుంట పంచాయతీలో మంగళవారం జరిగిన గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మిత్రుడు ప్రసాద్‌రెడ్డికి చెందిన కారు తీసుకుని ఒంటరిగా తనకల్లు వైపు బయల్దేరారు.

బుధవారం తెల్లవారుజామున బిళ్లూరివాండ్లపల్లి సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. మెడభాగంలో తీవ్రమైన గాయాలు కావడంతో నాగేంద్రరెడ్డి కారులోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, కుమార్తెలు మేఘన, కీర్తన ఉన్నారు. ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కదిరి ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించి, నాగేంద్రరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మరిన్ని వార్తలు