దరఖాస్తుల ఆహ్వానం

24 Jul, 2016 22:55 IST|Sakshi
తుని రూరల్‌ :
ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో మిగులు ఖాళీల భర్తీకి జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జగన్నాధగిరి ఏపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ శంకరరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ  భూపతిపాలెం (బాలురు), తుని మండలం జగన్నాథగిరి (బాలికలు) పాఠశాలల్లో చేరేందుకు ఆగస్టు పదిన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెండేళ్లు నిరంతరంగా చదివి జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీసీ, ఓసీలు జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు చెందనవారై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు ఏ ప్రాంతానికి చెందనవారైనా అర్హులన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను  జగన్నాథగిరి పాఠశాలలో అందించాలన్నారు. పరీక్ష ఆగస్టు పదిన ఉదయం పది గంటలకు నిర్వహిస్తామన్నారు. వివరాలకు 08854 252769 నంబరును కార్యాలయ పదివేళల్లో సంప్రదించాలన్నారు.
మరిన్ని వార్తలు