రుణాలు ఎగ్గొట్టేవారు మార్గదర్శకులా?

17 Jul, 2016 21:30 IST|Sakshi
రుణాలు ఎగ్గొట్టేవారు మార్గదర్శకులా?
 
 – మౌనంగా ఉంటే అన్ని బ్యాంకులను ప్రైవేట్‌ పరం చేయడం ఖాయం
– చేతనైతే ఆర్‌ఆర్‌బీలు అన్నింటినీ విలీనం చేయాలి
– యూనియన్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌బాబు
ఒంగోలు :
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే ప్రజాప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలు బ్యాంకు ఉద్యోగులకు మార్గదర్శకులా..? అని యూనియన్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ శోభన్‌బాబు ప్రశ్నించారు. ఆదివారం స్థానిక యూనియన్‌ బ్యాంకు ఆవరణలో బ్యాంకు ఉద్యోగులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే ఎస్‌బీఐ, అనుబంధ బ్యాంకుల విలీనం వేగవంతమైందని, ఈ విషయంలో మిగిలిన బ్యాంకు ఉద్యోగులు మౌనంగా ఉంటే ఆ పరిస్థితి ఇతర బ్యాంకులకు కూడా చుట్టుకుంటుందని శోభన్‌బాబు హెచ్చరించారు. ప్రభుత్వరంగ బ్యాంకులైనందునే డ్వాక్రా రుణాలు, రుణమాఫీ పథకాలను విజయవంతం చేశామని, దేశవ్యాప్తంగా 3 నెలల్లో రూ.22 కోట్ల జీరో బ్యాలెన్స్‌ జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు లె రవగలిగామని చెప్పారు. ప్రైవేటు బ్యాంకుల్లో పొదుపు ఖాతా ప్రారంభించాలంటే కనీసంగా రూ.10 వేలు నిల్వ ఉండాలంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలను బ్యాంకులకు దగ్గర చేస్తున్నాయా.. దూరం చేస్తున్నాయా.. అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. చేతనైతే గ్రామీణ బ్యాంకులన్నింటినీ విలీనం చేసి అతి పెద్ద బ్యాంకుగా చేయాలని, అందుకు సంపూర్ణ సహకారం అందించేందుకు బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సిద్ధంగా ఉందన్నారు. వాణిజ్య బ్యాంకుల్లో సంస్కరణల పేరుతో విలీన ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 29వ తేదీన దేశవ్యాప్త బ్యాంకింగ్‌ సమ్మెకు బెఫీ(బ్యాంకు ఎంప్లాÄæూస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పిలుపునిచ్చిందన్నారు. బెఫీ నాయకుడు, ఏపీజీబీ ప్రకాశం రీజియన్‌ కోశాధికారి నాగరాజు మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు ఎదుర్కొంటన్న సమస్యలపై ఈ నెల 27,28 తేదీల్లో సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు చెప్పారు. వాణిజ్య బ్యాంకులు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా ఈ నెల 29న గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు భాగస్వాములవుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో బెఫీ నాయకులు సురేంద్రకుమార్, సుధాకర్, టీఎల్‌ ప్రసాద్, సీఐటీయూ నగర అధ్యక్షుడు దామా శ్రీనివాసులు మాట్లాడారు.  
మరిన్ని వార్తలు