ఆదర్శంలో పురుగుల బియ్యమే గతి

5 Aug, 2016 23:29 IST|Sakshi
చెత్తాచెదారంతో కూడిన బియ్యం

బైరెడ్డిపల్లె :పేదవిద్యార్థులు కడుపునిండా ఆహారం తీసుకోవాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతాశయంతో అమలు చేస్తున్న వుధ్యాహ్న భోజన పథకంపై అడుగడుగునా నిర్లక్ష్యం తాండవిస్తోంది.  బిÄýæ్యుంలో పురుగులు, దువు్ము, వడ్లు లెక్కలేనన్ని ఉంటున్నాయి. ఈ ఆహారం తీసుకునే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా? అనేది అధికారులే తేల్చాలి..!
వుండలంలోని ఆదర్శ పాఠశాలకు ఆగష్టు నెల బియ్యం కోటా కింద  1260 కిలోలు గురువారం ఇచ్చారు.  పురుగులు, చెత్తా, చెదారం, వ్యర్థాలే  ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడి విద్యార్థులకు రోజుకు 40 కిలోల బియ్యం కేటాయిస్తున్నారు. మట్టి»ñ డ్డలు, రాళ్లు ఉన్న బియ్యం ఎలా వండాలని వంటవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యవుని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.
ఫిర్యాదు చేసినా...
పాఠశాలకు అందించిన బియ్యం నాసిరకంగా ఉన్నాయి. ఇందులో పురుగులు, రాళ్లు, చెత్తాచెదారం ఎక్కువగా ఉంది. దీనిపై పౌరసరఫరాల శాఖ డీటీకి ఫిర్యాదు చేశా. ఆయన ఇచ్చిన సెల్‌ నంబర్‌తో జిల్లా అధికారులతో మాట్లాడా. తామేమీ చేయలేమని అధికారులు అన్నారు. మాకు అందిన స్టాకు మాత్రమే ఇస్తున్నామని చెప్పారు.
– వెంకటరమణ, ప్రిన్సిపాల్, మోడల్‌స్కూల్‌

మరిన్ని వార్తలు