సంబరాల సాగరమై..

13 Jan, 2017 23:55 IST|Sakshi
సంబరాల సాగరమై..
జలధిని మించినట్టుగా.. అంబరాన్ని తాకిట్టుగా జనకెరటం ఎగసిపడింది. సంక్రాంతి సెలవులకు బంధుమిత్రులంతా రావడం.. భోగి పండగ సాయంత్రం అందరూ కలిసి, కాసేపు సరదాగా గడపాలని కోరుకోవడంతో.. సాగర సంబరాల్లో రెండో రోజైన శుక్రవారం కాకినాడ తీరం జనసంద్రాన్ని తలపించింది. సంబరాల వేదికపై ప్రదర్శించిన జానపద కళా, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఉర్రూతలూగించాయి.
 
కాకినాడ రూరల్‌ : 
సంబర సమయాన సాగరతీరం సందడిగా మారింది. ఉవ్వెత్తున ఎగసే కెరటంలా.. రెండోరోజూ శుక్రవారం పర్యాటకులు పోటెత్తారు.  ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల నృత్యాలు, హాస్యస్కిట్లు, మ్యూజికల్‌ నైట్స్, గాత్ర సంగీతం, నృత్యనాటికలు, జానపద కళారూపాలు, ఫ్యాష¯ŒSషో వంటి ప్రదర్శనలు పర్యాటకులను అలరించాయి. జిల్లాలోని అనేక పాఠశాలలకు చెందిన 550 మందికి పైగా విద్యార్థులు కోలాటం, నృత్యాలు, నాటికలు ప్రదర్శించారు. కూచిపూడి, భరతనాట్యం, సినీ డా¯Œ్సలు, సినీ నృత్యాలు, రింగ్‌ డ్యాన్సులతో అదరగొట్టారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రజాప్రతినిధులు, అధికారులు మెమెంటోలు అందజేశారు. 
‘ఫ్లవర్‌’ఫుల్‌ షో..
బీచ్‌ సంబరాల్లో బెంగళూరు ఫ్ల్లవర్‌షోతో పాటు కడియం, కడియపులంక నర్సరీ యజమానులు పెద్ద ఎత్తున పూలు, పండ్లు, కూరగాయలు జౌషధ, బోన్సాయ్‌ మొక్కలతో 60కిపైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రకాల రోగాలను నయం చేసే ప్రకృతి సిద్ధమైన వేర్లు, కాయలు, పండ్లను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనగా ఉంచారు. 
ఆకట్టుకున్న పలు స్టాళ్లు
మారేడుమిల్లి, అడ్డతీగల ప్రాంతాలకు చెందిన బొంగు చికె¯ŒS స్టాల్స్, ఆత్రేయపురం పూతరేకులు, పెరుమాళ్లపురం బెల్లం పాకం గారెలు, గోదావరి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీత, రొయ్య, సొర్ర, పండుగొప్ప, వంజురంలాంటి 34 రకాల వంటకాలు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తులు, మత్స్యశాఖ ఏర్పాటు చేసిన వివిధ రకాల చేపల అక్వేరియం, చేనేత వస్త్ర ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. తూరంగి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు గొబ్బెమ్మలతో ఆకర్షణీయంగా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసిన పాడిన పాటలు, ఆడిన ఆటలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు కళాకారులు నిర్వహించిన మ్యూజికల్‌ నైట్స్, జబర్దస్త్‌ టీము సభ్యుల హాస్యస్కిట్లు పర్యాటకులను కడుపుబ్బా నవ్వించాయి. 
 
>
మరిన్ని వార్తలు