‘అడుక్కోవడం’ అక్కడ పవిత్రమైన మొక్కు

28 Jan, 2016 10:10 IST|Sakshi
‘అడుక్కోవడం’ అక్కడ పవిత్రమైన మొక్కు

అనపర్తి: సాధారణంగా అమ్మవారి జాతరలు రాత్రి జరుగుతాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో కొలువు తీరి, కర్రి వంశీకుల ఆడపడుచుగా పూజలందుకునే సత్తెమ్మ తల్లి జాతర మాత్రం తరతరాల నుంచి పగటి వేళల్లో జరుగుతోంది. అంతేకాదు.. విలక్షణమైన మరో ఆనవాయితీని కూడా ఈ జాతర సందర్భంగా చూడవచ్చు. చిన్న, పెద్ద తేడా లేకుండా బాలురు, ధనిక పేద అన్న తారతమ్యం లేకుండా పురుషులు చిత్ర విచిత్ర వేషాలు వేసి బిచ్చమెత్తుతారు.

కోరిన కోరికలు తీరితే అలా బిచ్చమెత్తుతామని మొక్కుకోవడం వారికి రివాజు. అలా సేకరించిన సొమ్మును, కానుకలను అమ్మవారి హుండీలో వేసి, మొక్కుబడులు తీర్చుకుంటారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ముగింపు సందర్భంగా బుధవారం కనిపించిన ‘యాచకులు కాని యాచకులు’ వీరు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి దంపతులు కూడా జోలె పట్టడం విశేషం.

మరిన్ని వార్తలు