కొల్లేరు ప్రాంత చేపల సాగు ఆచరణాత్మకం

24 Oct, 2016 23:36 IST|Sakshi
కొల్లేరు ప్రాంత చేపల సాగు ఆచరణాత్మకం

కైకలూరు :  కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చేపల చెరువు రైతులు అవలంభిస్తున్నా సాగు విధానాలు ఆచరణాత్మకంగా ఉన్నాయని బీహార్‌ రాష్ట్ర శివాన జిల్లా ఔత్సహక రైతులు కితాబిచ్చారు. చేపల సాగు అధ్యాయనంలో భాగంగా పది రోజుల క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా సోమవారం కైకలూరులో పర్యటించారు. కోరుకొల్లు రోడ్‌లోని సత్యం చేప పిల్లల హేచరీని పరిశీలించారు. ఇక్కడ తెలుసుకున్న సాగు పద్ధతులను బీహార్‌ ప్రభుత్వ అధికారులకు వివరిస్తామని రైతులు చెప్పారు. కాకినాడ ఫిషరీస్‌ అసిస్టెంట్‌ చీప్‌ టెక్నిషియన్‌ రవిశంకర్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ కాకినాడ సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీష్‌ ఎడ్యూకేషన్‌ (సీఐఎఫ్‌ఈ) డాక్టర్‌ మురళీధర్‌ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలనకు రైతులు వచ్చారన్నారు. చేపల పట్టుబడి, ప్యాకింగ్, సాగు పద్దతులపై స్థానిక రైతులతో బీహార్‌ రైతులకు అవగాహన కలిగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఫిషరీస్‌ అసిస్టెంట్‌ చీప్‌ టెక్నిషియన్‌ నరసింహాచార్యులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు