ఏనాడైనా కాపు పెద్దలతో మాట్లాడారా?

1 Feb, 2016 11:42 IST|Sakshi
ఏనాడైనా కాపు పెద్దలతో మాట్లాడారా?

విశాఖపట్నం/భీమవరం: కాపు ఐక్య గర్జన సందర్భంగా తునిల చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రతిపక్షంపై చంద్రబాబు ఎదురుదాడికి దిగడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఉన్న తేడా కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమేనని గుర్తు చేశారు.

తుని ఘటనలపై ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించిన మీడియాపై కూడా ముఖ్యమంత్రి ఎదురుదాడి చేశారని చెప్పారు. ఏనాడైనా కాపు పెద్దలతో చంద్రబాబు మాట్లాడారా అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతరూపం దాలుస్తుందని భయపడే కమిషన్ వేశారని అన్నారు. చంద్రబాబు అసత్యవాది అంటూ దుయ్యబట్టారు.

తుని ఘటనలకు చంద్రబాబే కారణమని వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు అబద్దాలు చెప్పడం వల్లే ఈ ఘటనలు జరిగాయన్నారు. తుని ఘటనలకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

>
మరిన్ని వార్తలు