వజ్రకరూరులో సినీనటుడు నాగినీడు

7 Jul, 2017 22:49 IST|Sakshi
వజ్రకరూరులో సినీనటుడు నాగినీడు

వజ్రకరూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం సినీనటుడు నాగినీడు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని కొనకొండ్ల, చాబాల గ్రామాల్లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలతో పాటు వజ్రకరూర్‌ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం నాగినీడు సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. మర్యాద రామన్న సినిమా రిలీజ్‌ అయిన తర్వాత పలువురు నా వద్దకు వచ్చి మీ వాయిస్‌ బాగుందని చెప్పారన్నారు. అప్పటి నుంచి నాకు తెలిసిన విషయాలను నలుగురికీ చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా నాగినీడుతో ఫొటోలు దిగేందుకు పలువురు విద్యార్థులు ఉత్సాహం చూపారు. ఆయన వెంట జేవీవీ రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్‌యాదవ్, ఆర్డీటీ సీఓ నాగప్ప, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు