కనులపండువగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

18 Aug, 2017 22:11 IST|Sakshi
కనులపండువగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం శ్రావణలక్ష్మి సామూహిక వరలక్ష్మీ వ్రతాలు కనుల పండువగా సాగాయి. తొలుత ఆలయంలో నారసింహుడితో పాటు అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడికి మహిళా భక్తులు పెద్దసంఖ్యలో చేరుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్నారు.

అర్చక బృందం అమ్మవారికి పూజలు నిర్వహించిన మీదట ప్రధాన అర్చకులు వరలక్ష్మీ వ్రతం విశేషాన్ని వివరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్‌ వెంకటేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ నరేంద్రబాబు, సభ్యులు రఘునాథరెడ్డి, కటికెల వరలక్ష్మి, కరె నాగరాజు, రొడ్డారపు నాగరాజు, గంగులమ్మ, ఇతర పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు