చ‌ల్‌..చ‌లో..చ‌లో..!

5 Aug, 2017 23:44 IST|Sakshi
చ‌ల్‌..చ‌లో..చ‌లో..!
అకాడమీలో శిక్షణకు క్రీడాకారుల ఎంపిక
భానుగుడి(కాకినాడ): శాప్‌ ఆధ్వర్యంలో నాణ్యమైన క్రీడాకారులను ఎంపిక చేసి జాతీయ,అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో మెరిసేలా అకాడమీలలో కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎంపికైన క్రీడాకారులకు జిల్లాలోనే నిష్ణాతులైన కోచ్‌లతో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా 13 జిల్లాలో పలు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులనుంచి శనివారం దరఖాస్తులు స్వీకరించి, నైపుణ్యాలను పరిశీలించారు. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, వెయిట్‌ లిఫ్టింగ్‌ లకు సంబంధించి రాష్ట్రస్థాయిలో 96మంది  క్రీడాకారులు దరఖాస్తు చేసుకోగా వారికి శరీరధారుడ్య పరీక్షలు నిర్వహించారు. అథ్లెటిక్స్‌కు 31 మంది, జూడోకు 27, జిమ్నాస్టిక్స్‌కు–7, వెయిట్‌ లిప్టింగ్‌కు 31 మంది క్రీడాకారులు హాజరయ్యారని డీఎస్‌డీవో సయ్యద్‌ సాహెబ్‌ తెలిపారు. వీరందరికీ పలు పరీక్షలు నిర్వహించి ప్రతీ క్రీడకు 20 మంది చొప్పున క్రీడకారులను ఎంపిక చేస్తామన్నారు. ప్రతీ ఈవెంట్‌కు సంబంధించి నైపుణ్య పరీక్షలు నిర్వహించి క్రీడాకారుల ఎంపికలుంటాయన్నారు. ఎంపికలను శాప్‌ అడిషనల్‌ డైరక్టర్‌ ఎస్‌వీ రమణ పర్యవేక్షణలో జరుగుతున్నట్లు తెలిపారు.
నేడు సత్తిగీత, ఎన్‌.లక్ష్మి హాజరు
నేడు జరిగే ఎంపికలకు అంతర్జాతీయ అథ్లెట్‌ సత్తిగీత, వెయిట్‌లిఫ్టర్‌ ఎన్‌.లక్ష్మిలు హాజరు కానున్నారు. వీరితో విద్యార్థినులకు మోటివేషన్‌ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డీఎస్‌డీవో తెలిపారు.రాష్ట్ర ఒలింపిక్‌ అసోషియేషన్‌ ప్రెసిడెంట్‌ బడేటి వెంకటరామ్, జిమ్నాస్టిక్స్‌ ప్రెసిడెంట్‌ రామరాజు, జూడో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెకంట్,బాబులు ఎంపికలు నిర్వహించారు.
మరిన్ని వార్తలు