టవరెక్కిన కండక్టర్‌

11 Aug, 2016 18:12 IST|Sakshi
టవరెక్కిన కండక్టర్‌

డీఎం వేధిస్తున్నాడని నిరసన
డీఎంను సస్పెండ్‌ చేయండి లేదాంటే చస్తా అని బెదిరింపు
ఆర్‌ఎం హామీతో కిందకు దిగిన కండక్టర్‌ జీవీకేరెడ్డి
వేదింపులకు పాల్పడలేదు డ్యూటీ చేయమన్నందుకే  ఇదాంతా: డీఎం సూర్యనారాయణ


వికారాబాద్‌ రూరల్‌: డీఎం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ కండక్టర్‌ డిపోలో ఉన్న హైమాస్ట్‌ లైట్లకు సంబంధించిన టవర్‌ ఎక్కి చస్తానని బెదిరించిన సంఘటన వికారాబాద్‌ పట్టణంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌ డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నా జీవీకేరెడ్డి గురువారం ఉయదం వస్తూ వస్తూనే డిపోలో ఉన్న టవర్‌ ఎక్కి డీఎంను సస్పెండ్‌ చేయాలి లేదాంటే ఇక్కడి నుండి దూకి చచ్చిపోతానంటూ భిష్మించుకూర్చున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వికారాబాద్‌ సీఐ రవి సంఘటన స్థలానికి చేరుకుని జీవీకేరెడ్డిని కిందకు దిగాలని సూచించిన వినలేదు.

సుమారు గంటన్నరకుపైగా టవర్‌పైనే ఉన్న జీవీకేరెడ్డి వినేలా లేడని సీఐ రవి ఉన్నతాధికారులతో పాటు, ఆర్‌ఎంతో జీవీకేరెడ్డికి ఫోన్‌లో మాట్లాడించాడు. ఆర్‌ఎం ఏదైనా ఉంటే తగిన న్యాయం చేస్తానని ముందు టవర్‌ నుంచి కిందకు దిగాలని సూచించడంతో జీవీకేరెడ్డి కిందకు దిగాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. డీఎం సూర్యానారాయణ అనవసరంగా అందరి ముందు మర్యాద లేకుండా ‍ ప్రవర్తించి ఆయన కార్యాలయం ముందు మూడుగంటలు నిలబెట్టడం జరిగిందన్నారు. డ్యూటీలు పదే పదే వేస్తే  ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. వెంటనే ఆయనను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి యూనియన్‌ నాయకులతో సమస్యలను విన్నవించాడు.

ఎలాంటి వేదింపులు చేయలేదు: డీఎం సూర్యానారాయణ
నిరంతరం  ఆర్టీసీ  సిబ్బంది బాగుగోలు, ఆదాయం గురించి ఆలోచించడం తప్ప ఎప్పుడు ఎవరిని ఎలాంటి వేదింపులకు గురిచేయలేదు. సరిగ్గా పని చేయమన్నందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. డిపోలో ఎవరికి ఇవ్వనన్ని సెలవులు ఆయనకుఆరోగ్యం బాగు లేదంటే ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు కూడా అతనికి ఆరోగ్యం బాగా లేదంటే సెలవు ఇచ్చాం. నేను రైలులో హైదరాబాద్‌ వెళుదామని వెళుతుంటే ఆర్‌ఎం ఫోన్‌ చేసి కండక్టర్‌ టవర్‌ ఎక్కాడు అనేంత వరకు నాకు తెలియదు. ఆరోగ్యం బాగా లేక పోతే ఇంటికి వెళ్లాలి కాని టవర్‌ ఎక్కి బెదింరిచడం కావాలని చేస్తున్నారన్నారు. డిపోలో ఎవరినైనా చార్ట్ ప్రకారం డ్యూటీ చేయాలని సూచించడం జరుగుతుందన్నారు. డిపోలో అందరూ బాగుండాలని తపత్రయం పడుతాం సూచనలు సలహాలు ఇవ్వాలని కాని ఇలా ప్రవర్తించకూడదు.

మరిన్ని వార్తలు