స్కాచ్‌ అవార్డులు బెజవాడ స్థాయిని పెంచాయి

15 Sep, 2016 22:54 IST|Sakshi
స్కాచ్‌ అవార్డులు బెజవాడ స్థాయిని పెంచాయి
విజయవాడ సెంట్రల్‌ : నగరపాలక సంస్థ చరిత్రలో స్కాచ్‌ అవార్డులు ఓ మైలురాయిగా మిగిలిపోతాయని ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) అన్నారు. గురువారం కౌన్సిల్‌ హాల్లో కమిషనర్‌ జి.వీరపాండియన్, మేయర్‌ కోనేరు శ్రీధర్‌లకు అభినందన సభ నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ ఒకేసారి ఐదు అవార్డులు సాధించడం ద్వారా బెజవాడ స్థాయిని పెంచారని కొనియాడారు. మున్నెన్నడూ లేని విధంగా నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో  ఐదు వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి కావాలంటే  కొంతమందిని ఇబ్బంది పెట్టక తప్పదన్నారు.
ఢిల్లీ ముంబయిల స్థాయిలో మార్పు: కలెక్టర్‌ బాబు
 జిల్లా కలెక్టర్‌ బాబు.ఏ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ సేవలు నగరపాలక సంస్థ స్థాయిని పెంచాయన్నారు. ప్రజల వ్యవహార శైలిలోనూ మార్పు వచ్చిందన్నారు. ఢిల్లీ, ముంబై తరహాలో నగరంలో మార్పు కనిపిస్తోందన్నారు. పుష్కర ఘాట్లను టూరిస్ట్‌స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మేయర్‌ కోనేరు శ్రీధర్‌ మాట్లాడుతూ తన హయాంలో ఐదు అవార్డులు రావడం మధురమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా వేడుకల్ని పురస్కరించుకొని సేవలందిస్తున్న కార్పొరేషన్‌కు యూజర్‌ చార్జీలు చెల్లించే విధంగా చూడాలని కలెక్టర్‌ను కోరారు. పోలీస్‌శాఖకు ఏటా రూ.50 లక్షలు యూజర్‌ చార్జీలు చెల్లిస్తున్నారు కాబట్టి తమకూ చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. 
 
23 ప్రాంతాల్లో సోలార్‌ కేంద్రాలు: వీరపాండియన్‌
ప్రజాప్రతినిధులు సహకరిస్తే మరిన్ని అవార్డులు సాధించవచ్చని కమిషనర్‌ జి.వీరపాండియన్‌ అన్నారు. బహిరంగ మలమూత్ర రహిత నగరంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. నగరంలో 23 ప్రాంతాల్లో సోలార్‌ విద్యుత్‌ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. స్మార్ట్‌ మొౖ»ñ ల్‌యాప్‌ మెరుగైన ఫలితాలను ఇస్తోందన్నారు. భవిష్యత్‌లో అన్ని రకాల పన్నులు ఈ యాప్‌ద్వారానే వసూలు చేసే విధంగా యాక్షన్‌ప్లాన్‌ రూపొందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావు, జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఉప  మేయర్‌ గోగుల వెంకట రమణారావు తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు