ప్రభుత్వ లాంఛనాలతో కానిస్టేబుల్‌ అంత్యక్రియలు

9 Jun, 2017 22:06 IST|Sakshi
ప్రభుత్వ లాంఛనాలతో కానిస్టేబుల్‌ అంత్యక్రియలు
కర్నూలు: విద్యుదాఘాతంతో మృతి చెందిన కానిస్టేబుల్‌ సుల్తాన్‌(30) మృతదేహానికి స్వగ్రామం ఈ తాండ్రపాడులో శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఈయన మిడ్తూరు పోలీస్‌ స్టేషన్‌లో ఉంటూ ఆత్మకూరు డీఎస్పీ సుప్రజకు గన్‌మెన్‌గా విధులు నిర్వహించేవారు. గురువారం ఉదయం డ్రస్‌ మార్చుకునేందుకు ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంపై ఉన్న రేకుల షెడ్డులోకి వెళ్లి వేలాడదీసిన ఇనుపతీగపై ఆరేసిన టవాల్‌ను అందుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జె.దామోదర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు సత్యన్నయాదవ్, ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, నందికొట్కూరు సీఐ వెంకటరమణ, మిడ్తూరు ఎస్‌ఐ సుబ్రమణ్యం, సబ్‌ డివిజన్‌ పరిధిలోని పలువురు ఎస్‌ఐలు 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు  కార్యక్రమానికి హాజరయ్యారు. ఆత్మకూరు సబ్‌ డివిజన్‌ పోలీసుల తరపున డీఎస్పీ సుప్రజ మృతి చెందిన సుల్తాన్‌ కుటుంబానికి రూ.లక్ష  ఆర్థిక సహాయం అందించారు. ఈయనకు భార్యతో పాటు ముగ్గురు సంతానం. 
 
మరిన్ని వార్తలు