అరరే... ఎంత పనైపాయే!

29 Oct, 2023 03:38 IST|Sakshi

వైరల్‌

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రియాంక మిశ్రా ఊరకనే ఉండి ఉంటే వైరల్‌ అయ్యేది కాదు. సదరు కానిస్టేబుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ చేసి వైరల్‌ అయింది. ఈ రీల్‌లో ప్రియాంక మిశ్ర ‘కర్తవ్యం’ సినిమాలో విజయశాంతిని గుర్తు తెచ్చేలా ఓ లెవెల్లో నటించింది. సహజత్వం కోసం సర్వీస్‌ గన్‌ను ఉపయోగించి మరీ నటించింది. ఈ వీడియో వైరల్‌ కావడం మాట ఎలా ఉన్నా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ మాత్రం ‘చాల్లేండి సంబడం’ అంటూ ఆమెను సస్పెండ్‌ చేసింది.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేయడానికి ప్రియాంక దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తు ఆమోదం పొందింది. ఆగ్రాలో పోస్టింగ్‌ కూడా ఇచ్చారు. అయితే 48 గంటల్లోనే ఆమె నియామకాన్ని పోలీస్‌ కమిషనర్‌ ప్రీతిందర్‌సింగ్‌ రద్దు చేశారు. ప్రియాంక మిశ్రాపై సోషల్‌ మీడియాలో సానుభూతి చూపుతున్నవారితో పాటు, సానుభూతి చూపుతూనే ‘స్వయంకృతాపరాధం’ అని విమర్శించిన వాళ్లు కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు