మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి కంపు

30 Jun, 2016 01:41 IST|Sakshi
మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి కంపు

పనులు చేయకుండానే     రూ.15    లక్షలు స్వాహా?
జెడ్పీసీఈవో విచారణలో   బయటపడ్డ బాగోతం
అమ్యామ్యాలకు తలొగ్గిన  అధికారులు?
 

 
ఖానాపూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి కంపు కొడుతోంది. నేతలు, అధికారులు కుమ్ముకై పనులు చేయకుండానే లక్షల రూపాయలు కాజేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్, శెట్‌పల్లి, ఎర్వచింతల్ గ్రామాల్లో ఈ బాగోతం బయటపడింది.


మండలంలోని మస్కాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల ఎక్బాల్‌పూర్, మస్కాపూర్, గంగాపేట గ్రామాల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాల్లో నిధులు పూర్తిగా దుర్వినియోగం అవుతున్నట్లు మంగళవారం జెడ్పీ సీఈవో విచారణతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్చభారత్ మిషన్ కార్యక్రమం కింద మండలంలోని శెట్‌పల్లితోపాటు మస్కాపూర్, ఎర్వచింతల్ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేశారు. బహిరంగ మలవిసర్జన నిషేధించాలన్న ఉద్దేశంతో ఓడీఎఫ్ పథకం కింద మస్కాపూర్ పంచాయతీకి రూ.38.28లక్షలు విడుదల చేశారు. ఈ పనులను విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టాలి. ఈ కమిటీకి సర్పంచ్ చైర్మన్‌గా ఉంటు పనులు చేరుుంచాలి. అలా కాకుండా నిబంధనలు తుంగలో తొక్కి కొందరు నాయకులు, ప్రైవేటు వ్యక్తులు కలిసి సంబంధిత అధికారులకు ఆమ్యామ్యాల ఆశచూపి మరుగుదొడ్ల నిర్మాణ పనులు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు.

దీంతో ఖానాపూర్ ఎంపీపీ ఆకుల శోభారాణి  ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి మరుగుదొడ్ల నిర్మాణాల్లో జరిగిన పనులపై విచారణ చేపట్టారు. పంచాయతీలో మొత్తం 638 మరుగుదొడ్లు మంజూరు కాగా వాటిలో 266 మరుగుదొడ్లకు ముందస్తుగా 50 శాతం నిధులను గతేడాది డిసెంబర్ నుంచే విడుదల చేశారు. వీటిలో 126 మరుగుదొడ్లకు మస్కాపూర్‌కు చెందిన దాడిశెట్టి రాజిరెడ్డి పేరుపై రూ.7.56లక్షలు పొందారు. అలాగే ఎక్బాల్‌పూర్‌కు చెందిన గుగ్లావత్ లక్ష్మణ్‌కు  94 మరుగుదొడ్లకు రూ. 6.49 లక్షలు, మస్కాపూర్‌కు చెందిన దొనికేని సాగర్ 35 మరుగుదొడ్లకు రూ. 2లక్షలు, అదే గ్రామానికి చెందిన ైెహ మద్‌ఖాన్‌కు 11 మరుగుదొడ్లకు రూ.72 వేలు పొందారు.

దీంతో క్షేత్రస్థారుుకి వెళ్లి పరిశీలించగా ఒక్క మరుగుదొడ్డి లేకపోవడంతో సీఈవో విస్మయం చెందారు. డిసెంబర్ నుంచి బిల్లులు చె ల్లింపు ప్రారంభమైన ఇప్పటి వరకు నిర్మాణాలు పూర్తికాకపోవడంతో స్థానిక అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు మాత్రమే పూర్తికావడం గమనార్హం.
 
సమగ్ర విచారణ చేపట్టాలి
మండలంలోని ఆదర్శ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతికి సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి. తూతూమంత్రంగా విచారణ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే ఉరుకునేది లేదు. మస్కాపూర్‌తోపాటు శెట్‌పల్లి, ఎర్వచింతల్ గ్రామాల్లో ఓడీఎఫ్ గ్రామాల్లోని అవినీతిని సమగ్రంగా పరిశీలించి కారకులైన వారందరిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం.   - ఆకుల శోభారాణి, ఎంపీపీ

>
మరిన్ని వార్తలు