వరంగల్ కలెక్టరేట్ జప్తునకు కోర్టు ఆదేశాలు

14 Jul, 2016 02:22 IST|Sakshi

హన్మకొండ అర్బన్: బాధితులకు డబ్బులు చెల్లించే విషయంలో జిల్లా యం త్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం (మూవబుల్ ప్రాపర్టీ) జప్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు అమలు బాధ్యతను జిల్లా కోర్టుకు అప్పగించింది.  2006లో జిల్లా యంత్రాంగం ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో జిల్లాలోని సుమారు 500 మంది టీచర్లకు ఆంగ్ల బోధనపై శిక్షణ ఇప్పించింది. ఇందుకు సంబంధించి ఎల్టా అనే సంస్థకు రూ.1.50 లక్షలు చెల్లించే విష యంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఎల్టా ప్రతినిధులు జిల్లా కోర్టును ఆశ్రయించగా, కలెక్టరేట్ జప్తునకు ఆదేశాలు ఇచ్చింది.. దీనిపై అధికారులు స్టే తెచ్చుకుని అప్పీలుకు వెళ్లారు. చివరకు హైకోర్టు కూడా ఎల్టాకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బాధితులకు డబ్బు చెల్లించని కారణంగా కలెక్టరేట్ జప్తునకు గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఎత్తివేస్తూ ఆవే ఉత్తర్వులు అమలు చేయాలని చెప్పింది.
 
 ఈ క్రమంలో బాధితులు జిల్లా కోర్టులో ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసుకుని గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరారు. స్పందించిన కోర్టు ఖర్చులతో కలిపి బాధితులకు రూ.2.06 లక్షలు చెల్లించాలని ఆదే శించింది. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని జప్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు ఉత్తర్వులు అమల్లో భాగంగా ఫీల్డ్ అధికారి సత్తార్, ఎల్టా తరపున జిల్లా కోర్టులో వాదించిన న్యాయవాది హరిహరరావు కలెక్టరేట్ అధికారులకు ఉత్తర్వుల కాపీలు అందజేశారు. దీంతో వారంలో డబ్బులు చెల్లించే విధంగా అధికారులకు- ఎల్టా ప్రతినిధులకు మధ్య ఒప్పందం కుదిరిందని ఎల్టా ప్రతినిధులు కొమురయ్య, శ్రీనివాస్ తెలిపారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా