నిరుపయోగంగా ఉన్న డంపింగ్‌ యార్డు

17 Aug, 2016 01:39 IST|Sakshi
నిరుపయోగంగా ఉన్న డంపింగ్‌ యార్డు
రామన్నపేట: గ్రామాల్లో పారిశుద్ధ్యంను మెరుగుపరిచే విషయంలో పాలకులు, అధికారుల్లో చిత్తశుద్ధి కరువయింది. ఉపయోగించేవారు లేక  లక్షలు వెచ్చించి నిర్మించిన డంపింగ్‌యార్డులు నిరుపయోగంగా మారాయి. రామన్నపేట మండలంలో 20గ్రామపంచాయతీలున్నాఇయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీపథకం కింద 17గ్రామాల్లో డంపింగ్‌యార్డులను తవ్వడం ప్రారంభించారు. స్థలాభావంవల్ల నిధానపల్లి, ఇస్కిళ్ల, సిరిపురంగ్రామాల్లో పనులు ప్రారంభించలేదు. 10మీటర్ల వెడల్పు, 15మీటర్ల పొడవు, 2మీటర్లలోతు ఉండేవిధంగా 550 పనిదినాలు, రూ. 1.48లక్షల అంచనావ్యయంతో డంపింగ్‌యార్డ్‌లను తవ్వడం ప్రారంభించారు. వీటిలో బోగారం, దుబ్బాక, జనంపల్లి, కుంకుడుపాముల, లక్ష్మాపురం, మునిపంపుల, రామన్నపేట, సూరారం, ఇంద్రపాలనగరం, ఉత్తటూరు, వెల్లంకి, ఎన్నారం గ్రామాల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి.  పల్లివాడ, నీర్నెముల, కక్కిరేణి గ్రామాల్లో వివిధ కారణాలవల్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. గేదెనుకొని తాడుకు భయపడ్డ చందంగా ప్రభుత్వం లక్షలు వెచ్చించి డంపింగ్‌యార్డులను తవ్వి, వేలుపెట్టి చెత్త బండ్లను సమకూర్చలేక పోయింది. 
కూడిపోతున్న డంపింగ్‌యార్డులు
పారిశుద్ధ్య కార్మికులు గ్రామాల్లోని మురుగుకాలువలు, వీధుల్లో తీసిన చెత్తను ట్రాక్టర్లు, తోపుడుబండ ్లద్వారా  డంపింగ్‌యార్డులకు చేరవేయవలసి ఉంటుంది.  డంపింగ్‌ యార్డులను తవ్వే సమయంలోనే గ్రామీణ నీటిసరఫరా పారిశుద్ధ్య విభాగంవారు చెత్తను రవాణా చేయుటకు అవసరమైన బండ్లను సమకూర్చుటకు అవసరమైన రిక్వైర్‌మెంట్‌ను కూడా తీసుకున్నారు.  ఏళ్లు గడుస్తున్నా ఏఒక్కగ్రామానికి బండ్లను అందజేయలేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు తీసిన చెత్తను జనావాసాలకు దగ్గరల్లో పడవేస్తున్నారు. అక్కడ పందులు సంచిరిస్తూ జుగుత్సాకరమైన వాతావరణంను సృష్టిస్తున్నాయి.  లక్షలువెచ్చించి తవ్విన డంపింగ్‌యార్డులలో పక్కనున్న మట్టిజారి కూడిపోతున్నాయి.  కంపచెట్లు, పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి.
 
ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి....నక్క రామనర్సయ్య,జనంపల్లి
 
వీధులు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. సర్కారువాళ్లు సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వీధుల్లో పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో ప్రజలు కూడా తమ ఇంటి మాదిరిగానే వీధులను శుభ్రంగా ఉంచుకోవాలి. 
 
 చెత్తబండ్లను సమకూర్చాలి.....దేశపాక లక్ష్మినర్సు సర్పంచ్‌ ఎన్నారం
ప్రభుత్వం డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేసింది కానీ చెత్త బండ్లను ఇవ్వడం మరిచింది. గ్రామాల్లోని చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్‌యార్డులకు చేరవేయాలనేది మంచి ఆలోచన. ప్రభుత్వం ఆలోచనకు తగ్గట్లు చెత్తను చేరవేయడానికి తోపుడు బండ్లను సమకూర్చాలి. 
 
>
మరిన్ని వార్తలు