విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

12 Jan, 2017 00:25 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక ఆర్ట్‌ కళాశాల డ్రామా హాల్‌లో విద్యార్థులకు జిల్లాస్థాయిలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. 63 మండలాల నుంచి 224 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నట్లు జేసీ బి.లక్ష్మీకాంతం, డీఆర్వో సి.మల్లీశ్వరిదేవి తెలిపారు. ప్రథమ బహుమతి సాధించిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 18న వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులకు 21న జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు.

చిత్రలేఖనం పోటీలను ఎన్నికల విభాగం పర్యవేక్షులు వరదరాజులు, సిబ్బంది భాస్కరనారాయణ, సువర్ణ, మహేశ్, మాధవి, డ్రాయింగ్‌ మాస్టర్లు పర్యవేక్షించారు. ఈ పోటీల్లో కె.గజేంద్ర, 10వ తరగతి, ఆమిదాల గొంది(మడకశిర) పి.ఆనంద్‌ ఏపీ మోడల్‌ జూనియర్‌ కళాశాల(యాడికి), ఎస్‌.ముజాహిద్‌బాషా, ఉన్నత పాఠశాల(కళ్యాణదుర్గం) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. బుక్కపట్నం ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి జి.జిత్రేంద్ర ప్రోత్సాహక బహుమతికి ఎంపికయ్యారు.

మరిన్ని వార్తలు