పరీక్షల వేళ.. ఎన్నికల గోల!

18 Feb, 2017 23:22 IST|Sakshi
పరీక్షల వేళ.. ఎన్నికల గోల!
  • బడిలో రాజకీయ వేడి
  • పరీక్ష సమయంలో ఎమ్మెల్సీ పోరు
  • ప్రచారపర్వంలో ఉపాధ్యాయులు
  • అయోమయంలో విద్యార్థులు
  • సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పరీక్షల కాలం దరిచేరింది. ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పరీక్షలకు ఎన్నికలకు లింకు ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండీ మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి వచ్చే నెల తొమ్మిదిన ఎన్నికలు జరుగను న్నాయి. ఈ ఎన్నిక కాస్తా వార్షిక పరీక్షల వేళ వస్తుండడం.. ఓటర్లంతా ఉపాధ్యా య, అధ్యాపకవర్గాలు కావడంతో విద్యాసం స్థల్లో రాజకీయ వాతావరణం నెలకుంది. శాసనమండలి ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉపాధ్యాయ సంఘాలు సర్వశక్తులొడ్డుతున్నాయి. కొందరు టీచర్లు ఏదో ఒక యూనియన్‌కు అనుబంధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో విద్యాబోధనకు తాత్కాలి క విరామం ప్రకటించి మరీ ప్రచారపర్వంలో మునిగిపోతున్నారు. దీంతో వార్షిక పరీక్షల వేళ విద్యార్థులకు పునఃశ్చరణ తరగతులు లేకుండా పోయాయి.

    విద్యా బోధనకు ఆటంకం
    మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు మొదలవుతుండగా.. అదే నెల 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూ   ల్‌ వెలువడడం.. ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ ఘట్టం జరుగుతుండడంతో బరిలో దిగే అభ్యర్థుల వెంట ఉపాధ్యాయులు పరుగెడుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రచారపర్వం  ఊపందుకుంటున్న తరు ణంలో ఉపాధ్యాయుల మద్ధతు కూడగట్టే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ప్రతిరోజూ పాఠశాలలను తిరుగుతూ.. సాయంత్రం వేళ మర్యాదపూర్వక భేటీల పేరిట ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో విద్యాబోధనపై దృష్టి సడలుతోంది.

    పరీక్షల వేళ విద్యార్థులు ఏకాగ్రత కోల్పోకుండా సిలబస్‌ను రివిజన్‌ చేయించాల్సిన మాస్టార్లు..ఇలా కరపత్రాలు పట్టుకొని అభ్యర్థుల వెంట ప్రచారానికి వెలుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పదో తరగతి పరీక్షలకు కనీసం నెలరోజుల గడువు కూడా లేదు. 9న పోలింగ్, 15న కౌంటింగ్‌ జరుగుతుండడం.. అలాగే ఇంటర్మీడియట్‌ పరీక్షలు అదే నెల 20 తేదీవరకు ఉండడం.. ఈ మధ్యలోనే పోలింగ్‌ జరుగనుండడం విద్యార్థుల వార్షిక పరీక్షల ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఈ ప్రచారాన్ని తిప్పికొడుతున్నాయి. పాఠశాల సమయ వేళల్లో ఎన్నికల ఊసెత్తకుండా... ఆ తర్వాతే తమ మనోభీష్టానికి అనుగుణంగా నడుచుకుంటున్నట్లు చెబుతున్నారు.

    అత్యవసరం ఉంటేనే సెలవులు
    త్వరలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. అత్యవసర పరిస్థి తుల్లోనే ఉపాధ్యాయులు సెలవులను వాడుకోవాలి. పిల్లల చదువులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. పాఠశాలల సమయం, ప్రత్యేక తరగతుల నిర్వహణపై టీచర్ల ప్రచార ప్రభావం ఏ మాత్రం ఉండకుండా నడుచుకోవాలి. ఒకవేళ ఆన్‌ డ్యూటీలో ప్రచారం సాగిస్తున్నట్లు గుర్తిస్తే సదరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవు.
    – కె. సత్యనారాయణ రెడ్డి, డీఈఓ

మరిన్ని వార్తలు