ఆరుగురు అలీగఢ్‌ వర్సిటీ విద్యార్థుల అరెస్ట్‌

12 Nov, 2023 05:55 IST|Sakshi

ఐసిస్‌ నెట్‌వర్క్‌ బట్టబయలు

లక్నో: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐసిస్‌) తరఫున పనిచేస్తున్నారనే ఆరోపణలపై యూపీ పోలీసులు అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. నిందితులందరికీ అలీగఢ్‌ యూనివర్సిటీ విద్యార్థుల సంఘమైన స్టూడెంట్స్‌ ఆఫ్‌ అలీగఢ్‌ యూనివర్సిటీ(సము)తో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు.

వీరు తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ, ఐసిస్‌లోకి కొత్త వారిని చేర్చుకుంటున్నారని ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌) విభాగం తెలిపింది. దేశంలో భారీ ఉగ్రదాడికి వీరు కుట్ర పన్నుతున్నారని వెల్లడించింది. అరెస్టయిన వారిలో రకీమ్‌ ఇనామ్, నవీద్‌ సిద్దిఖి, మహ్మద్‌ నొమాన్, మహ్మద్‌ నజీమ్‌ అనే నలుగురిని గుర్తించింది. వీరందరినీ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్‌ చేసినట్లు వివరించింది. ఇప్పటికే ఈ విద్యార్థి సంఘం కార్యకలాపాలపై కేంద్ర నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయని కూడా పేర్కొంది.

మరిన్ని వార్తలు