వీర జవాన్ ముస్తాక్ కుటుంబానికి ఆర్థిక సాయం

13 Feb, 2016 13:20 IST|Sakshi
వీర జవాన్ ముస్తాక్ కుటుంబానికి ఆర్థిక సాయం

విజయవాడ: సియాచిన్ లో ఇటీవల మరణించిన వీర జవాను ముస్తాక్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఇటీవల సియాచిన్‌ మంచు చరియల్లో చిక్కుకుపోయి చనిపోయిన రాష్ట్రానికి చెందిన వీర జవాను ముస్తాక్‌ అహ్మద్‌ ను మాతృ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధీరోదాత్తుడిగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. జవాను రాష్ట్ర యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారని సీఎం ప్రశంసించారు. ముస్తాక్ స్వస్థలం కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని  పార్నెపల్లి గ్రామం. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు.  

దేశసరిహద్ధుల్లో భద్రతా పర్యవేక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన ముస్తాక్ గొప్ప పోరాట యోధుడని చంద్రబాబు అభివర్ణించారు. దేశం కోసం చివరి శ్వాస వరకు పోరాటం సాగించే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన  ముస్తాక్ అహ్మద్ కుటుంబానికి ప్రభుత్వం బాసటగా ఉంటుందని ఆయన తెలిపారు. దేశ సేవలో చనిపోయిన వీర జవాన్ ముస్తాక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు ఆర్ధిక సహాయంతో పాటు ఒక ఇల్లును మంజూరు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

మరిన్ని వార్తలు