ఫ్రీ.. ఫ్రీ.. టోల్ ఫ్రీ

19 Feb, 2016 01:05 IST|Sakshi

పాలకోడేరు రూరల్ :
 ప్రభుత్వం నుంచి పౌరులకు అందే వివిధ సేవలను నేరుగా ఫోన్‌చేసి ఎలాంటి ఖర్చు లేకుండానే పొందే వెసులుబాటు ఉంది. ఫోన్ చేయడానికి పైసా కూడా ఖర్చు ఉండదు. వీటినే టోల్ ఫ్రీ నంబర్లుగా పిలుస్తుంటారు. ఆ నంబర్లు, వాటి వివరాలు మీ కోసం..

 ఎమర్జెన్సీ అంబులెన్స్ 108
 ప్రవూదం జరిగినా.. ప్రాణాపాయు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని రక్షించాలన్నా 108 నంబర్‌కు ఫోన్ చేయాలి. వైద్య సిబ్బంది అంబులెన్స్‌లో తక్షణమే వచ్చి బాధితులకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తారు. అంతేకాకుండా సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళతారు.

 అగ్ని ప్రమాదం జరిగితే 101
 అగ్ని ప్రవూదం.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు 101 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయ చర్యలు చేపడతారు.

 మహిళలకు 102
 గర్భిణులు ప్రసవ సమయంలో ఆసుపత్రికి వెళ్లడానికి.. ప్రసవానంతరం ఇంటికి చేరుకోవడానికి 102 నంబర్‌కు ఫోన్ చేస్తే వాహనం అందుబాటులోకి వస్తుంది.

 పోలీస్ సేవలకు 100
 పోలీస్ శాఖ నుంచి తక్షణ సాయుం
 పొందడానికి, గృహ హింస, వరకట్న వేధింపుల బారిన పడినవారు ఈ నంబర్‌కు ఫోన్ చేయాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల సాగుతున్నా
 ఇదే నంబర్‌కు తెలియజేయవచ్చు.

 క్రైం స్టాపర్ 1090
 చోరీలు, ఇతర నేర సంబంధిత సమస్యలను తెలియజేసేందుకు 1090కు ఫోన్ చేయవచ్చు. ఈ కాల్ జిల్లా కేంద్రంలోని క్రైమ్ స్టాపర్ విభాగానికి వెళుతుంది. అసాంఘిక కార్యకలాపాలు, వేధింపులు, జూదం, వ్యభిచారం వంటి అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చు.

 బ్లడ్ బ్యాంక్స్ 1910
 రక్తం అవసరమైన వారు అందుబాటులో ఉన్న గ్రూపు రక్తం, ఇతర వివరాలను 1910 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

 మీ సేవ 1100
 మీ సేవ పథకాల అవులు తీరు, సవుస్యలపై 1100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అవసరమైన సమాచారం తెలుసుకోవచ్చు.

 ఎన్నికల సంఘం 1950
 ఓటర్ల నమోదు, తొలగింపు, పేరు మార్పు, ఓటు వేసే ప్రదేశం మార్పు తదితర వివరాలను 1950కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

 హెచ్‌ఐవీ కంట్రోలర్
 రూమ్ 1997
 హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధులకు సంబంధించిన సమాచారం, బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను 1997కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

 వ్యవసాయ శాఖ
 1800-425-1110
 ధాన్యం, పంటలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, రైతుల సమస్యలు, మిల్లర్ల దోపిడీ, అధికారులు సహకరించకపోవడం తదితర అంశాలపై ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వొచ్చు.

 ఏపీఈపీడీసీఎల్ 155333
 విద్యుత్ సరఫరాలో అంతరాయుం, లో-ఓల్టేజి, సిబ్బంది పనితీరు, ఇతర విద్యుత్ సవుస్యలను ఈ నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు.

 అవినీతి నిరోధక శాఖ 155361
 ప్రభుత్వ ఉద్యోగులు,అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు తెలిస్తే 155361 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు.

 ఉపాధి హామీ పథకం 155321
 గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించేందుకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ నంబర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పథక అమలులో తలెత్తే సమస్యలు, అవినీతిపై ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వవచ్చు.

 బీఎస్‌ఎన్‌ఎల్ 198
 బీఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ కనెక్షన్, ఆ
 శాఖకు సంబంధించిన ఇతర సమస్యలపై వినియోగదారులు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

 చైల్డ్ లైన్ 1098
 ఆదరణ, రక్షణ లేని బాలలను ఆదుకునేందుకు.. బాలలు ఇబ్బందులు పడుతున్నట్టు, నిర్బంధంలో ఉన్నట్టు తెలిసినా ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

 ఆర్టీసీ 1800-200-4599
 రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఆర్టీసీ)సేవలు, బస్సుల్లో అసౌకర్యాలు, ప్రయూణికులతో  సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదు చేయుడానికి, ఇతర వివరాల కోసం ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

 రైల్వే 131
 రైల్వే రిజర్వేషన్, రైళ్ల రాకపోక వివరాలు, స్థానిక రైల్వే స్టేషన్ సవూచారం తెలుసుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు