కష్టార్జితం బూడిద

8 Nov, 2016 02:16 IST|Sakshi
కష్టార్జితం బూడిద

  పెదపాడు గాంధీనగర్‌లో అగ్ని ప్రమాదం
   19 పూరిళ్లు దగ్ధం
  కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
   రూ.25 లక్షలు ఆస్తినష్టం
 

 పాతశ్రీకాకుళం/శ్రీకాకుళం సిటీ: శ్రీకాకుళం రూరల్ మండలం పెదపాడు గాంధీనగర్‌లో సోమవారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదంలో 19 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో సుమారు 25 లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకు కావడంతో మంటలు వ్యాపించి ప్రమాదం సంభవించినట్టు స్థానికులు చెబుతున్నారు. బాధితులంతా నిరుపేదలు కావడం, ఉన్నదంతా అగ్నికి ఆహుతి కావడంతో వారంతా నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో మిగిలారు. మంటలు భారీగా ఎగిసిపడడంతో ఇళ్లలోని నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  గాంధీనగర్ శివారులో 23 పూరిళ్లలో కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా వీధివ్యాపారులు చేసుకోవడం, ఇళ్లలో పాచిపనులు చేసుకొని జీవిస్తున్నారు. వీరిలో 19 కుటుంబాలకు చెందిన ఇళ్లు బూడిద కావడంతో వారంతా తీవ్రంగా నష్టపోయారు. ప్రమాద సమాయంలో ఓ ఇంటిలో అంగన్‌వాడీ కేంద్రం నడుస్తోంది. అరుుతే పక్కనే ఉన్న ఇల్లు బూడిదవ్వగా.. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అంగన్‌వాడీ కేంద్రానికి ప్రమాదం తప్పింది. అందులో ఉన్న   38 మంది పిల్లలను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకొని వెళ్లిపోయారు.
 
  బాధిత కుటుంబాలు..
  అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోరుున వారిలో దాసు అప్పన్న, దాసు పోలయ్య, పట్ట అప్పమ్మ, పట్ట నీలరాజు, పట్ట రాము, కలగ సూర్యనారాయణ, తొగరాపు లక్ష్మి, కోరాడ రాజు, మగడ అప్పారావు, తొగరాపు కామేశ్వరి, సవలాపురం గణేష్, పోలాకి లక్ష్మి, దువ్వ సూర్యనారాయణ, ఎచ్చెర్ల రామకృష్ణ, కోడ తిరుపతిరావు, దువ్వ పంటోడు, కొవరాపు కృష్ణ, ఎచ్చెర్ల ఎర్రమ్మ, బి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
 
  తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది
   ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. దీంతో ఆస్తి నష్టం తగ్గింది.
 
 నష్టం రూ.25 లక్షలు
 ప్రమాదంలో 19 మంది బాధితులకు సంబంధించి సుమారు 25 లక్షల రూపాయలు ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని శ్రీకాకుళం తహసీల్దార్ సుధాసాగర్ తెలిపారు. పెద్దపాడు సొసైటీ భూముల్లో వీరు పూరిళ్లలో నివసిస్తున్నారన్నారు. 30 నిమిషాల వ్యవధిలోనే ఇళ్లన్నీ దగ్ధమయ్యావని, ప్రమాద విషయాన్ని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. తక్షణ సాయంగా బాధితులకు పదేసి కిలోల చొప్పున బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్, రూ.5 వేల నగదు ఇస్తామన్నారు. రెడ్‌క్రాస్ తరపున దుస్తులు, వంటపాత్రలు సమకూర్చుతామని, ముఖ్యమంత్రి రిలీఫ్‌ఫండ్‌కు ప్రతిపాదిస్తామన్నారు.
 
 - సిలిండర్ లీకేజీ వల్లే ప్రమాదం
 శ్రీనివాసరెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, శ్రీకాకుళం
 సిలిండర్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి చెప్పారు.గాలి వీయడంతో ఇళ్లకు మంటలు త్వరగా వ్యాపించి కాలిపోయినట్టు పేర్కొన్నారు.  ఓ ్రపయాణీకుని సమాచారంతో తక్షణమే ఘటనా స్థలికి చేరుకొని మంటలను తమ సిబ్బంది అదుపు చేశారన్నారు.

మరిన్ని వార్తలు