కొనుగోడు కేంద్రాలు

17 Nov, 2016 01:51 IST|Sakshi
కొనుగోడు కేంద్రాలు

అన్నదాతను వెంటాడుతున్న కొనుగోలు కష్టాలు
కేంద్రాల ఏర్పాటుపై ఇప్పటికీ స్పష్టత కరువు
అప్పుడే మొదలైన అక్రమ రవాణాలు
ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్న దళారులు
రైతన్నకు మిగిలింది కష్టమే...

 
అష్టకష్టాలు పడి... ప్రకృతికి ఎదురీది... ఆర్థిక సమస్యలను అధిగమించి... కంటికి రెప్పలా కాపాడుకున్న వరి పంట కోతలు మొదలయ్యారుు. అప్పుడే కళ్లాలకు చేను తరలుతోంది. ఇప్పుడిప్పుడే నూర్పులు మొదలుపెట్టి బస్తాల్లో భద్రపరుస్తున్నారు. ఆరుగాలం కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించే తరుణమిది. పెట్టుబడికి తగిన గిట్టుబాటుకోసం పరితపించే సమయమిది. సర్కారు ఇందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాల్సిన కాలమిది. కానీ సర్కారు ఇంకా దీనిపై దృష్టిసారించలేదు. మద్దతు ధరను అధికారికంగా ప్రకటించి... విసృ్తత ప్రచారం చేపట్టలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత నివ్వలేదు. కానీ అన్నింటా ముందుండే దళారీ వ్యవస్థ మాత్రం అప్పుడే సిద్ధమైంది. రైతన్న కష్టాన్ని తక్కువ మొత్తానికే కాజేసేందుకు బాటలు వేసుకుంది.
 - పార్వతీపురంరూరల్/ బలిజిపేటరూరల్/సీతానగరం
 
బలిజిపేట మండలంలో గత ఏడాది ఇలా...
కొనుగోలు కేంద్రాలు:    వెలుగు ఆధ్వర్యంలో 5, పీఏసీఎస్ 2
 విక్రరుుంచిన రైతులు:    3075
 సేకరించిన ధాన్యం:    38,041.48టన్నులు
 ఈ ఏడాది ఖరీఫ్ సాగు:    6,307 హెక్టార్లలో  
 
 
 
జిల్లాలోని పార్వతీపురం డివిజన్‌లో అప్పుడే కోతలు మొదలయ్యారుు. వరి నూర్పులు చేసి కళ్లాల్లో అమ్మకానికి ధాన్యం సిద్ధమైంది. కానీ సర్కారు మాత్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీనివల్ల అప్పుడే దళారులు కళ్లాల్లో వాలుతున్నారు. ధాన్యాన్ని అక్రమంగా మిల్లుకు తరలించేస్తున్నారు. సర్కారు క్వింటా సాధారణ రకం రూ. 1470లుగా ప్రకటించినప్పటికీ దళారులు మాత్రం క్వింటాకు రూ.  1250లే చెల్లిస్తున్నారు. రైతన్న అవసరాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు.
 
పార్వతీపురం మండల వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ పంట అన్నదాతకు అనుకూలంగా మారినా.. కొనుగోలు కేంద్రాలు సర్కారు ఏర్పాటు చేయకపోవడంతో మధ్య దళారులు అప్పుడే లాభాలు పొందుతున్నారు. . దాదాపు 30శాతం వరకు వరి కోతలు పూర్తయ్యారుు. పండిన ధాన్యాన్ని విక్రరుుంచేందుకు ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల కన్ను వాటిపై పడింది. గత ఏడాది ప్రారంభంలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు దశలవారీగా 13 కేంద్రాలకు విస్తరించారు. బిల్లుల చెల్లింపు మాత్రం మార్చివరకు కొనసాగారుు. ఈ ఏడాది ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసే లేదు.

ఈ నెలాఖరు నాటికి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నారుు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది.  ఈ ఏడాది 35వేల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నారుు. సుమారు 26వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల్లో సేకరించడానికి సన్నద్ధమవుతున్నాం.- ఎం.వాసుదేవరావు, మండల వ్యవసాయాధికారి
 

తరలిపోతున్న ధాన్యం : సీతానగరం మండలం 2016-17 ఖరీఫ్ సీజన్‌లో రైతులు వరి ఎదలు, ఉభాల రూపంలో 6,148 హెక్టార్లలో వరిపంట సాగుచేసి 1.5లక్షల క్వింటాళ్ళ ధాన్యం పండించినట్లు అధికారుల అంచనా. అనుకున్న సమయం కంటే ముందుగానే వర్షాలు కురవడంతో తొలుత ఆరుతడి భూముల్లో వరి ఎదలు వేశారు. నీటి వనరులున్న భూముల్లో ఉభాలు చేశారు. దీంతో నవంబర్ రెండో వారం నుంచే వరి కోతలు ముమ్మరంగా ప్రారంభించి... నూర్పులు మొదలెట్టేశారు. కానీ సర్కారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో పండించిన పంటలో చాలా వరకూ ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. రైతుల అవసరాల దృష్ట్యా తక్కువ ధరకు విక్రరుుంచాల్సి వస్తోంది. ఈ మండలంలో ప్రైవేటు వర్తకులు క్వింటాలు ధాన్యానికి కేవలం రూ. 1190లే చెల్లిస్తున్నారు.
 
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు....
మండలంలోని వరిచేలు కోతలు జరుగుతున్న కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాలని నిర్ణరుుంచాం. 9 పీఏసీఎస్‌లు, 5 గ్రామైక్య సంఘాల ద్వారా కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం.    - బి సత్యనారాయణ, తహసీల్దార్, సీతానగరం.

మరిన్ని వార్తలు