పండుగకు వచ్చి పరలోకాలకు

13 Oct, 2016 03:23 IST|Sakshi
పండుగకు వచ్చి పరలోకాలకు

 సాగర్ కాల్వలో పడి నలుగురి మృత్యువాత
  కోదాడ:  ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో పడి నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. మృతుల్లో కృష్ణా జిల్లా వత్సవాయి మండ లం దేశపాలెంకి చెందిన ఫకీరాబీ, చిన సైదులు దంపతుల సంతానం షేక్ సుద్దాబీ(18), హుస్సేనాబేగం (14), ముస్తఫా (10)తోపాటు, ఖమ్మం జిల్లాకు చెందిన సైదాబీ, షేక్ మహబూబ్ హుస్సేన్‌ల కుమారుడు రియూజ్(9) ఉన్నారు. వీరంతా 4 రోజుల క్రితం పీర్ల పండుగకు అమ్మమ్మ మీరాబీ నివాసం ఉంటున్న నడిగూడెం మండలం సిరి పురానికి వచ్చారు. బుధవారం బట్టలు ఉతికేం దుకు సైదాబీతోపాటు నలుగురు వెళ్లారు.
 
  హుస్సేనాబేగం తమ్ముళ్లు ముస్తఫా, రియూజ్ లకు కాల్వ దరి వెంట స్నానం చేయిస్తుండగా, అత్త సైదాబీ, సుద్దాబీ బట్టలు ఉతుకుతున్నారు. ఈ క్రమంలో హుస్సేనాబేగం ప్రమాదవశాత్తు కాలు జారి నీళ్లలో పడడంతో ముస్తఫా, రియూజ్‌లు ఆమెను రక్షించేందుకు నీటిలోకి వెళ్లారు. ఈత రాక ముగ్గురూ కేకలు వేస్తుండగా.. పక్కనే బట్టలు ఉతుకుతున్న సుద్దాబీ వారిని రక్షించేం దుకు నీటిలోకి దూ కింది. అయితే వారంతా సుద్దాబీని గట్టిగా పట్టుకోవడంతో ఆమెతో పాటు అందరూ నీటిలో మునిగిపోయూరు. వెంటనే చుట్టుపక్కల వారు వచ్చి కాల్వలోకి దిగి నలుగురిని బయటికి తీయగా అప్పటికే వారంతా చనిపోయూరు. మృతుల్లో ముగ్గురు విద్యార్థులు కాగా, సుద్దాబీకి 8 నెలల క్రితమే వివాహం జరిగింది.
 

మరిన్ని వార్తలు