‘పరిమితి’ దాటింది.. ప్రమాదం జరిగింది

17 Aug, 2016 00:17 IST|Sakshi
‘పరిమితి’ దాటింది.. ప్రమాదం జరిగింది
  • నలుగురు ప్రయాణించడంతో అదుపు తప్పిన బైక్‌
  • సూచిక బోర్డును ఢీకొనడంతో గాయాలపాలైన వైనం
  • కురవి/డోర్నకల్‌(వరంగల్): ద్విచక్రవాహనం ప్రయాణికుల సామర్థ్యం 2 మాత్రమే. అంతకు మించిన సంఖ్యలో ప్రయాణిస్తే ప్రమాదాలు జరుగుతాయనే దానికి ఈ సంఘటన ఓ నిదర్శనం. మండలంలోని బలపాల గ్రా మానికి చెందిన బొడ్డు శేఖర్‌ తన భార్య ఉమ, ఇద్దరు కుమార్తెలు అంకిత,సునిత(మెుత్తంనలుగురి)తో కలిసి బైక్‌పై డోర్నకల్‌ వైపునకు మంగళవారం ఉదయం బయలుదేరాడు.

    గ్రామ శివారులోని మూలమలుపు వద్దకు చేరుకోగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న సూచిక బోర్డును ఢీకొంది. దీంతో నలుగురికీ తీవ్ర గాయాలయ్యాయి. శేఖర్‌ ఎడమ మోకాలి కింది భాగం పూర్తిగా విరగడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు వీరిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఎక్కువ మంది ఉన్నప్పుడు బస్సులు, రైళ్లలో ప్రయాణించడం శ్రేయస్కరం.
>
మరిన్ని వార్తలు