అందుబాటులో లేని 300 ఉచిత బస్సులు

14 Jul, 2015 16:08 IST|Sakshi

రాజమండ్రి సిటీ: పుష్కరాల కోసం వచ్చే భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ 300 సిటీ బస్సులను సిద్ధం చేసింది. కానీ, రాజమండ్రి పట్టణంలో పుష్కరాల తొలిరోజు మంగళవారం ఒక్కటంటే ఒక్క బస్సు కూడా భక్తులకు అందుబాటులో లేకుండా పోయింది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పట్టణంలో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో బస్సులను నడిపే పరిస్థితి లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు వాటిని నిలిపివేశారు.

బస్సులు లేకపోవడంతో భక్తులు కొంత దూరం ఆటోలలో, మిగతా దూరం కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు ఎండ వేడిమికి తట్టుకోలేక భక్తులు దాహంతో అలమటించిపోయారు. పుష్కర ఘాట్లలో మినహా పట్టణంలో మరెక్కడా మంచినీటి సరఫరా జరగ్గపోవడంతో నీటి కోసం పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

మరిన్ని వార్తలు