జాదవ్ సెంచరీ.. భారత్ సముచిత స్కోరు | Sakshi
Sakshi News home page

జాదవ్ సెంచరీ.. భారత్ సముచిత స్కోరు

Published Tue, Jul 14 2015 4:04 PM

జాదవ్ సెంచరీ.. భారత్ సముచిత స్కోరు

హరారే: జింబాబ్వేతో చివరి, మూడో వన్డేలో టీమిండియా 277 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ (105) అజేయ సెంచరీతో చెలరేగగా, మనీష్ పాండే (71) హాఫ్ సెంచరీలతో రాణించాడు. జాదవ్కిది  కెరీర్లో తొలి వన్డే సెంచరీ.  

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్లు రహానె (15), మురళీ విజయ్ (13.. జింబాబ్వే బౌలర్ మడ్విజా బౌలింగ్లో వెంటవెంటనే అవుటయ్యారు. దీంతో టీమిండియా 33 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఆ తర్వాత రాబిన్ ఊతప్ప.. మనోజ్ తివారి (10)తో కలసి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించినా స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ సమయంలో మనీష్ పాండే, కేదార్ జాదవ్ బాధ్యతాయుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించి జట్టు స్కోరు 200 మార్క్ దాటించారు. పాండే, జాదవ్ ఐదో వికెట్కు 144 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పాండే నిష్ర్కమించగా, జాదవ్ అజేయ సెంచరీ చేసి జట్టుకు సముచిత స్కోరు అందించారు.

Advertisement
Advertisement