చనిపోతా...అనుమతి ఇవ్వండి

4 Jul, 2016 13:01 IST|Sakshi
చనిపోతా...అనుమతి ఇవ్వండి

మదనపల్లి(చిత్తూరు జిల్లా) : బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న తమ కుమార్తెను చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలని తల్లిదండ్రులు న్యాయమూర్తి ఎదుట మొరపెట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం ఉదయం మదనపల్లి రెండవ అదనపు జిల్లా కోర్టులో చోటుచేసుకుంది. మదనపల్లి విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రాయిపేట నారాయణ, శ్యామల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కూలిపనులు చేసుకుని జీవించేవారు.

వీరి రెండవ కుమార్తె రెడ్డిమాధవి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఏడాది కాలంగా ఆమె బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతోంది. బెంగుళూరు, తిరుపతి, హైదరాబాద్‌లలో పెద్దపెద్ద ఆస్పత్రులలో చూపించినా ప్రయోజనం లేకపోయింది. రెడ్డిమాధవి ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తోంది. ఆమె చిక్కిశల్యమైంది. ఇటీవల బెంగుళూరు ప్రైవేటు ఆస్పత్రిలో చూపిస్తే 6లక్షలు ఖర్చు తెస్తే వైద్యం చైస్తామని చెప్పారు.

కూలిపనులు చేసుకునే తాము అంతమొత్తం భరించలేమని, ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనన్న ఆందోళనతో తాము కాలం గడుపుతున్నామని, అందువల్ల తమ కుమార్తెను చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలని వారు న్యాయమూర్తిని అభ్యర్థించారు. ఈ మేరకు న్యాయమూర్తికి లేఖ అందజేశారు.

 

మరిన్ని వార్తలు