ముద్రగడ అరెస్ట్కు నిరసనగా గోదావరి జిల్లాల బంద్

9 Jun, 2016 19:52 IST|Sakshi

కిర్లంపూడి: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అరెస్ట్కు నిరసనగా కాపు సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. చేబ్రోలు వద్ద రోడ్డుపై నేతలు బైఠాయించడంతో కత్తిపూడి-కాకినాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముద్రగడ అరెస్ట్కు నిరసనగా రేపు తూర్పుగోదావరి, శనివారం పశ్చిమగోదావరి జిల్లా బంద్కు కాపు సంఘాలు పిలుపునిచ్చాయి.

తాజా పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా కాపు సంఘాలు అత్యవసర సమావేశాన్ని చేపట్టాయి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్ లోని కాపు కార్యాలయంలో ఆల్ ఇండియా కాపు జేఏసీ నేతలు భేటీయ్యారు. ముద్రగడ అరెస్ట్ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై కాపు నేతలు చర్చించారు. బేషరుతుగా ముద్రగడను విడుదల చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ముద్రగడను విడుదల చేయకపోతే శనివారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తామని ఆల్ ఇండియా కాపు జేఏసీ ప్రకటించింది.

మరిన్ని వార్తలు