‘‘శాతవాహన’పై నిర్లక్ష్యమెందుకు?’

25 Apr, 2017 18:11 IST|Sakshi

► వెంటనే ప్రభుత్వ మెస్‌     ప్రారంభించాలి
► కలెక్టరేట్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నా


కరీంనగర్‌సిటీ: శాతవాహన యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరించడం శోచనీయమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నగేశ్‌ అన్నారు. వర్సిటీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌యూలో ప్రైవేట్‌ మెస్‌ను తక్షణమే రద్దు చేసి ప్రభుత్వపరంగా ప్రారంభించాలన్నారు. విద్యార్థుల పాత మెస్‌ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. విద్యార్థుల భోజన ఖర్చులను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే భరించాలన్నారు.

వర్సిటీలో 80 శాతం గ్రామీణ, బలహీనవర్గాల పేదలే చదువుకుంటున్నారని, సుమారు 500 మంది పస్తులుంటున్నారని పేర్కొన్నారు. వర్సిటీకి మూడేళ్లుగా వైస్‌ చాన్స్‌లర్‌ లేకుంటే పాలన, అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అధ్యాపకులు, సిబ్బంది కొరతతో పాలన పూర్తిగా గాడితప్పిందన్నారు. సర్కారు స్పందించిన వర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని, అధ్యాపకులు, సిబ్బంది కొరత తీర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఈ ధర్నాలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర నాయకుడు అక్కెనపల్లి కుమార్, నగర అధ్యక్షుడు ఇంజినీర్‌ సాన రాజన్న, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరాల శ్రీనివాస్, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి ఎడ్ల సురేందర్‌రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు బోగె పద్మ, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ.సలీం, జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌ కంది వెంకటరమణ, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వన్నారం అక్షయ్, మానకొండూర్, చిగురుమామిడి, రామడుగు మండలాల పార్టీ అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, గడ్డం విద్యాసాగర్‌రెడ్డి, వరాల అనిల్, నాయకులు రాచమల్ల నర్సయ్య, పచ్చునూర్‌ గ్రామ అధ్యక్షుడు సీపల్లి సంతోష్, డి.విజయ్, దేవునూరి శ్రీనివాస్, గుంట సంజీవ్, గుంట మహేశ్, పొన్నాల అనిల్, పోన్నాల అజయ్, దాల్వ మారుతి, రేపాక శ్రీకృష్ణ, మధుపాక అరవింద్, గడ్డం సాయికృష్ణ, తాండ్ర రాకేశ్, చిట్యాల సాయి ప్రీతమ్, దాచారం రామన్న, బానోతు సాయి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు