పౌర హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

12 Dec, 2016 14:47 IST|Sakshi
పౌర హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
* తుళ్ళూరులో కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం
* అంబేడ్కర్‌ కల్పించిన పౌరహక్కులపై
ప్రసంగించిన ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాల నేతలు
 
తుళ్లూరు: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తుళ్లూరులోని ఎస్సీ కమ్యూనిటీ హాలులో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. రాజదాని ప్రాంత సీఐటీయూ నాయకుడు జె.నవీన్‌ ప్రకాష్‌ అద్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కెవీపీఎస్‌ అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపినా, ,ప్రశ్నించినా వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం, రాజకీయ కక్షలకు దిగడం వంటి చర్యలకు ప్రభుత్వాలు పాల్పడడం ప్రజాస్వామ్యానికి  తూట్లు పొడవడమే అన్నారు. మేధావులు, ,ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఏకమై హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సీపీఐ నాయకులు రాజు, ఈశ్వరరావు, సీపీఎం నాయకులు ఎం.రవి, జె.వీర్లంకయ్య, వైఎస్సార్‌ సీపీ నాయకులు బత్తుల కిషోర్, నందిగం సురేష్, ప్రజాసంఘాల నేతలు స్వచ్ఛంద సంస్థల నేతలు రామారావు, బిళ్ళా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు